శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (20:16 IST)

ఏపీలో బియ్యం ధరలకు రెక్కలు.. రూ.25కేజీల బస్తా రూ.1600

rice
తుఫాను తీరం దాటగానే నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. గత కొద్ది నెలలుగా బియ్యం ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. 
 
ఏపీలో ప్రస్తుతం నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.56 వరకు ఉంటోంది. మిల్లర్ల నుంచి హెల్‌సేల్ వ్యాపారులకు వచ్చే బియ్యంపై కిలోకు రూ.3 నుంచి రూ.5 రుపాయల వరకు లాభం కలుపుకుని విక్రయిస్తుంటారు. 
 
మూడు నెలల క్రితం రూ.1250-1300 ఉన్న 26కేజీల బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.1600కు చేరువలో ఉంది. కిలో బియ్యం ధర రూ.60కు చేరుతుందని వ్యాపారులు చెబుతున్నారు.