శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (20:37 IST)

భారతదేశంలో తమ మొట్టమొదటి ట్రూ వైర్‌లెస్‌ బడ్స్‌ను పరిచయం చేసిన అమెజాన్‌

అమెజాన్‌ ఇండియా నేడు ఎకోబడ్స్‌ సెకండ్‌ జనరేషన్‌ను పరిచయం చేసింది. ఇవి ప్రీమియం ఆడియో నిర్మాణాత్మక శైలిని స్పష్టమైన, సమతుల్యమైన శబ్ద, అనుకూలీకరించిన యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సాంకేతికత, వైర్‌లెస్‌చార్జింగ్‌ సామర్ధ్యం, అలెక్సాకు హ్యాండ్స్‌ ఫ్రీ యాక్సెస్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ మరియు ఐఓఎస్‌ఫోన్లతో ఎకో బడ్స్‌ అనుకూలంగా ఉండటంతో పాటుగా కస్టమైజబల్‌ ట్యాప్‌ కంట్రోల్స్‌తో గుగూల్‌ అసిస్టెంట్‌, సిరికి సైతం మద్దతునందిస్తాయి. ఈ పూర్తి సరికొత్త ఎకోబడ్స్‌ 11,999 రూపాయల ప్రారంభధరతో పరిమిత కాలపు రాయితీ 1000 రూపాయలతో లభిస్తాయి.

 
‘‘ఎకో శ్రేణిలో ఇప్పుడు ప్రయాణ సమయాల్లో సైతం వినియోగించడానికి అనువైన ఉపరణాలను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము, తమతో పాటుగా అలెక్సాను వెంట తీసుకుని వెళ్తున్న మా వినియోగదారుల అనుభవాలను సైతం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎకోబడ్స్‌తో, వినియోగదారులు తమ రోజంతా వాటిని ఇంటి వద్ద లేదా తమ చుట్టు పక్కల ప్రాంతాలలో నడవడం లేదా పని కోసం వెళ్తున్నప్పుడు సైతం వినియోగించుకోవచ్చు’’ అని పరాగ్‌ గుప్తా, కంట్రీ మేనేజర్‌, అమెజాన్‌ డివైజస్‌ ఇండియా అన్నారు.

 
‘‘వినియోగదారులు కేవలం అలెక్సాను సంగీతం వినిపించమని అడగడం, ఆడియో బుక్స్‌ వినడం, తమ ప్రియమైన వారికి కాల్‌ చేయడం మరియు ప్రయాణ సమయాల్లో మరెంతగానో చేయవచ్చు. నాకు ఇష్టమైనది నూతనంగా ఆవిష్కరించిన ఫీచర్‌. దీనిలో నేను అలెక్సాను ప్రస్తుతం నేను వింటున్న పాటను ఇతర అలెక్సా ఉపకరణాలలోకి పంపించమనడం లేదా అక్కడి నుంచి ఎకోబడ్స్‌కు పంపమనడం చేయమనవచ్చు. అక్కడ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే ఇతర ఉపకరణాలలో ఆ పాటను ఇది ప్లే చేస్తుంది’’ అని ఆయన జోడించారు.

 
నూతన యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో శక్తివంతమైన ఆడియో అనుభవాలు
ప్రతి బడ్‌లోనూ అత్యున్నత ప్రదర్శన కనబరిచే డ్రైవర్‌ ఉంది. ప్రతి బడ్‌ స్పష్టమైన, సమతుల్యమైన శబ్దాలను విస్తరించిన డైనమిక్‌ శ్రేణితో అందిస్తాయి. అందువల్ల మీరు మీ సంగీతం నుంచి మరెంతానో పొందవచ్చు. ఈ ప్రీమియం స్పీకర్లును మెరుగైన ఫిడెలిటీని బాస్‌, ట్రెబల్‌లో అందించే రీతిలో మలిచారు. ఇది మీడియా ప్లే బ్యాక్‌ సమయంలో అవరోధాలను తొలగించడంతో పాటుగా ఆహ్లాదకరమైన మెలోడీలు, స్పష్టమైన వోకల్స్‌ను సైతం అందిస్తుంది. మీరు బాస్‌, ట్రెబల్‌ను అలెక్సా యాప్‌ పైన ఉన్న ఈక్విలైజర్‌ ద్వారా కూడా మీరు నియంత్రించవచ్చు.

 
అమెజాన్‌ యొక్క యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీ కలిగి ఉండటంతో పాటుగా అత్యాధునిక చిప్‌సెట్‌ శక్తివంతమైన  ఈ పూర్తి సరికొత్త ఎకోబడ్స్‌, వాతావరణపు శబ్దాలను సైతం పూర్తిగా రద్దు చేస్తాయి. మీరు మీ అభిమాన సంగీతం , పొడకాస్ట్స్‌ లేదా ఆడియోబుక్స్‌ను మీరు ప్రయాణిస్తున్న సమయంలో లేదా ఇంటిలో మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు వినవచ్చు. యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను ఆన్‌ చేయడం కోసం ఏదో ఒక ఇయర్‌బడ్‌ను అతి సరళంగా నొక్కి పట్టుకుని ఉంచితే సరిపోతుంది లేదంటే కేవలం ‘అలెక్సా, టర్న్‌ ఆన్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌’అని కమాండ్‌ ఇవ్వడం లేదా అలెక్సా యాప్‌ నుంచి సెట్టింగ్స్‌ పొందడం చేయవచ్చు.

 
ఒకవేళ మీ చుట్టూ ఏం జరుగుతుందో వినాలనుకుంటే  ఏదో ఒక ఇయర్‌బడ్‌ను నొక్కి పట్టుకుని పాస్‌ త్రూ మోడ్‌ ఎనేబల్‌ చేయడం లేదా ‘అలెక్సా, టర్న్‌ ఆన్‌ పాస్‌త్రూ’ అని చెబితే సరిపోతుంది. పాస్‌ త్రూ మోడ్‌ ఆన్‌ కావడంతో మీరు  అతి సులభంగా మీరు కోరుకున్న రీతిలోనే మీ చుట్ట పక్కల శబ్దాలను వినడం లేదా అలెక్సా యాప్‌ పై డివైజ్‌ సెట్టింగ్స్‌ ఫీచర్‌ వినియోగించుకుని కూడా చేయవచ్చు.

 
రోజంతటికీ సౌకర్యమందించేలా కస్టమైజబల్‌ ఫిట్‌
పూర్తి సరికొత్త ఎకోబడ్స్‌ అతి చిన్నవిగా ఉండటంతో పాటుగా తేలికగా ఉంటాయి. ఇవి ఐపీఎక్స్‌4 రేటింగ్‌ కలిగి ఉండటంతో పాటుగా చిరుజల్లులు, చెమట లేదా తేలిక పాటి వర్షం సైతం తట్టుకుంటాయి. వీటిని గరిష్ట సౌకర్యం అందించే రీతిలో డిజైన్‌ చేశారు. స్వల్ప నాజిల్‌ మరియు అంతర్గతంగా నిర్మించిన వెంట్స్‌ వంటివి వినియోగ సమయంలో చెవిపై ఒత్తిడి తగ్గిస్తాయి మరియు ఎకోబడ్స్‌ను రోజంతా సుదీర్ఘకాలం పాటు వినియోగించేందుకు అనుకూలంగా మారుస్తాయి. నాలుగు ఇయర్‌ టిప్‌ పరిమాణాలు   మరియు రెండువింగ్‌ టిప్‌ పరిమాణాలు సైతం మీ కొనుగోలులో భాగంగా ఉంటాయి. మీకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ ఫిట్‌ను మీరు వినియోగించుకోవచ్చు. సెటప్‌ సమయంలో, అతి సులభమైన ఇయర్‌ టిప్‌ ఫిట్‌ పరీక్షను అలెక్సా యాప్‌తో చేసుకోవచ్చు. ఇది అత్యుత్తమంగా ఫిట్‌ను పొందేందుకు మీకు సహాయపడుతుంది. అందువల్ల ఎకో బడ్స్‌ అనుభూతులను మరియు అసాధారణ శబ్దాలను పొందవచ్చు.

 
ఆటలు లేదా పని కోసం శక్తివంతం
ఎకోబడ్స్‌ దాదాపుగా ఐదు గంటల వరకూ ప్లే బ్యాక్‌ సయమాన్ని ఒక్కసారి చార్జ్‌ చేస్తే యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మరియు అలెక్సా వేక్‌ వర్డ్‌ ఆన్‌ ఫీచర్‌తో వస్తుంది. ఈ కంపాక్ట్‌ కేస్‌ రెండు అదనపు చార్జ్‌లను సైతం అందించడం ద్వారా మొత్తంమీద 15 గంటల వరకూ మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ను సైతం అందిస్తుంది. మీరు ఎకోబడ్స్‌ వినియోగిస్తున్నప్పుడు మీ బ్యాటరీ స్టేటస్‌ను పరీక్షించడం  కోసం అతి సింపుల్‌గా ‘అలెక్సా, మా బ్యాటరీ స్టేటస్‌ ఏమిటి?’ అని అడగటమే !మీరు మీ బ్యాటరీ స్టాటస్‌ను మీ అలెక్సా యాప్‌లో సైతం పరీక్షించుకోవచ్చు లేదా మీ ఎకోబడ్స్‌ లోపల ఉండగా కేస్‌ను తెరువడం ద్వారా ప్రతి బడ్‌పై వెలిగే ఎల్‌ఈడీ లైట్లు బ్యాటరీ స్థితి తెలుపుతాయి. ఎకోబడ్స్‌ను యుఎస్‌బీ–సీ (బాక్స్‌తో పాటుగా వస్తాయి)తో చార్జ్‌ చేయవచ్చు మరియు ఈ వైర్‌లెస్‌ అవకాశాలను  అనుకూలమైన క్యుఐ సర్టిఫైడ్‌  వైర్‌లెస్‌ చార్జింగ్‌ ప్యాడ్స్‌ తో  (వీటిని వేరుగా కొనుగోలు చేయాలి)చార్జ్‌ చేయవచ్చు.

 
మీ వినోదావకాశాలన్నింటి కోసం అతి సులభమైన ప్రాప్యత
మీకు తెలిసిన మరియు అలెక్సాపై మీరు అభిమానించే కంటెంట్‌ను ఎక్కడనుంచి అయినా అతి సులభంగా పొందడానికి అతి సులభమైన మార్గంగా ఎకోబడ్స్‌ నిలుస్తాయి.  అమెజాన్‌ ప్రైమ్‌ మ్యూజిక్‌, హంగామా, జియో సావన్‌, గానా, యాపిల్‌ మ్యూజిక్‌, స్పాటిఫై  నుంచి  మీ అభిమాన పాటలను వినడం లేదా ఆడిబల్‌ నుంచి ఆడియోబుక్‌ వినడం, ఆడిబల్‌ సునో నుంచి సెలబ్రిటీలు చెప్పే కథలను  వినడం ఇలా ఎన్నో చేయవచ్చు. నూతన అలెక్సా ఫీచర్‌ మీరు అత్యంత సౌకర్యవంతంగా సంగీతాన్ని విభిన్నమైన అలెక్సా ఉపకరణాల వ్యాప్తంగా ఆస్వాదించేందుకు తోడ్పడుతుంది. మీరు అతి సులభంగా ‘అలెక్సా, మూవ్‌ మై మ్యూజిక్‌ టు ఎకోబడ్స్‌‘ అని చెప్పడం ద్వారా మీ ఎక్కడైతే సంగీతం వినడం ఆపారో అక్కడ నుంచే మరలా దానిని ఆస్వాదించడమూ వీలవుతుంది.

 
మీ మొబైల్‌ ఫోన్‌పై ఉన్న అలెక్సా యాప్‌ ద్వారా అలెక్సాకు ఈ ఎకోబడ్స్‌ కనెక్ట్‌ చేయవచ్చు. అలాగే మీ ప్రస్తుత డాటా పథకాలను సైతం సంగీతం, కాలింగ్‌ మరియు మరెన్నో ఫీచర్ల ద్వారా ఆస్వాదించవచ్చు, ఎకోబడ్స్‌ మూడు మైక్రోఫోన్ల సమ్మేళనంగా ఉంటుంది. ఇది మీ ప్రసంగం కనుగొనడంతో పాటుగా ఒకవేళ క్లౌడ్‌లో ఉంటే సురక్షితంగా  ప్రాసెస్‌ చేస్తుంది. వీటిలో బహుళ అంచెలలో గోప్యత రక్షణచర్యలు మరియు నియంత్రణలు ఉన్నాయి. అలెక్సా యాప్‌ ద్వారా మైక్‌లు మ్యూట్‌ చేయడం లేదా బడ్‌ పై భాగంలోని కంట్రోల్స్‌ ద్వారా అనుకూలీకరించడం చేయవచ్చు.