శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (18:08 IST)

భ‌ద్రాచలం ఆలయానికి భారత్ బయోటెక్ కోటి విరాళం

Lord Rama
భార‌త్ బయోటెక్ భ‌ద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర‌స్వామి ఆల‌యానికి భారీ విరాళాన్ని అంద‌జేసింది. ఆల‌యంలో కొన‌సాగుతున్న నిత్యా‌న్న‌దానానికి భార‌త్ బ‌యోటెక్ యాజమాన్యం రూ.1 కోటిని అంద‌జేసింది. 
 
ఈ మేర‌కు ఆ సంస్థ ప్ర‌తినిధులు సోమ‌వారం భ‌ద్రాద్రి ఆల‌య ఖాతాకు రూ.1 కోటి విరాళాన్ని బ‌దిలీ చేశారు. 
 
భ‌ద్రాద్రి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ప్ర‌తి రోజు అన్నదాన స‌త్రంలో అన్న ప్ర‌సాదాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ అన్న‌దానం కోస‌మే భార‌త్ బ‌యోటెక్ కోటి రూపాయ‌ల విరాళాన్ని అంద‌జేసింది.
 
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా జనవరి 13న తిరుపతిలోని తిరుమల ఆలయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లా శ్రీవారికి రూ.2 కోట్ల విరాళాన్ని అందజేశారు.