బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (18:49 IST)

రాహుల్ దయాగుణం .. ఎముక మజ్జ మార్పిడి చికిత్స కోసం విరాళం

భారత క్రికెట్ జట్టులోని యువ క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ఒకరు. ఈ యంగ్ క్రికెటర్‌లో దయాగుణం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన తాజాగా తన చేతల్లో నిరూపించారు. 11 యేళ్ళ బాలుడికి ఎముక మజ్జ మార్పిడి చికిత్స కోసం రూ.31 లక్షల మేరకు తన సొంత డబ్బులను విరాళంగా ఇచ్చాడు. 
 
అత్యంత అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపుడుతున్నారు. ఈ బాలుడుకి అత్యవసరంగా ఎముక మజ్జ మార్పిడి చికిత్స చేయాల్సివచ్చింది. అయితే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు భరించలేక ఆ బాలుడి తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. 
 
ఈ విషయం తెలుసుకున్న కేఎల్ రాహుల్.. తన బృందం ద్వారా ఆ పిల్లాడి వివరాలు తెలుసుకుని ఆపరేషన్ ఖర్చుల కోసం రూ.31 లక్షల తక్షణ ఆర్థిక సాయం చేశారు. 
 
దీనిపై కేఎల్ రాహుల్ స్పందిస్తూ, గివ్ ఇండియా సంస్థ ద్వారా ఆ బాలుడి అనారోగ్య పరిస్థితి తెలిసింది. ఆ వెంటనే ఆ బాలుడికి తల్లిదండ్రులకు చేతనైన సాయం చేయాలని నిర్ణయించాను. ఆపరేషన్ సక్సెస్ కావడం, ఆ బాలుడు కోలుకోవడం చాలా సంతోషా్ని ఇస్తుంది అని రాహుల్ వ్యాఖ్యానించారు.