మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (18:13 IST)

కోహ్లీ రికార్డును బ్రేక్.. ఐపీఎల్‌ -2022లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా?

ఐపీఎల్‌ -2022లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కేఎల్ రాహుల్ అవతరించాడు. ఐపీఎల్ 2022కు మెగా వేలంపాటను నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో జట్లు తోడవనున్నాయి. దీంతో వేలంపాట మరింత ఆసక్తికరంగా మారనుంది.
 
మరోవైపు ఈ రెండు జట్లు తమ డ్రాఫ్ట్ పిక్స్‌ను అధికారికంగా ప్రకటించాయి. బీసీసీఐ రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఇరు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను తీసుకున్నాయి. లక్నో జట్టు కేఎల్ రాహుల్‌ను రూ. 17 కోట్లకు తీసుకుంది. అంతేకాదు తమ జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకుంది. 
 
ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కోహ్లీ పేరిట ఇప్పటి వరకు రికార్డు ఉంది. ఆ రికార్డును రాహుల్ ప్రస్తుతం కైవసం చేసుకున్నాడు.