1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 జూన్ 2025 (16:05 IST)

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025: బిస్లెరి ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ కాలుష్యం ముగింపు కాంపైన్

World Environment Day 2025 Campaign Ending Plastic Pollution
బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సమగ్రమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 కాంపైన్‌ను విజయవంతంగా ముగించింది. ప్లాస్టిక్ కాలుష్యంతో ఏకరీతి ప్రయత్నంతో పోరాడటానికి నాలుగు రాష్ట్రాల్లో వేలాదిమంది వలంటీర్లను సమీకరించింది. అంతర్జాతీయ ఇతివృత్తం, “ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు”తో కలిసి ఈ కార్యక్రమం తమిళనాడు, కర్ణాటక, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరీలలో వ్యూహాత్మకమైన భాగస్వామాలు, అట్టడుగు స్థాయి ప్రమేయాలతో గణనీయమైన ప్రభావం చూపించింది.
 
తమిళనాడులో, బిస్లెరి తమిళనాడు వెట్ ల్యాండ్స్ మిషన్ భాగస్వామంతో చెన్నై ఎలైట్ బీచ్, బసంత్ నగర్‌లలో నది ఒడ్డున నడక, కోస్తా తీర ప్రాంతం శుభ్రపరిచే డ్రైవ్‌కి నాయకత్వంవహించింది. ఈ డ్రైవ్‌లో 100 మందికి పైగా వలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ. ఆర్. విద్యాధర్, IFS, తమిళనాడు వెట్ ల్యాండ్స్ యొక్క అసిస్టెంట్ మిషన్ డైరెక్టర్ హాజరయ్యారు. ఐఐటి మద్రాస్ వారి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లీన్ వాటర్, ఇంటర్నేషనల్ డీకార్బొనైజేషన్, రెన్యువబుల్ ఎనర్జీ అసోసియేషన్, చెన్నై ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అర్బేజర్ సమీత్ సహా కీలకమైన భాగస్వాములను ఒక చోట సమావేపరిచింది.
 
కంపెనీ తిరువల్లూరులో నగరం వ్యాప్తంగా శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టింది, 20 ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసింది. ముఖ్యమంత్రి డాష్ బోర్డ్ పైన ఈ ప్రయత్నాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడి తద్వారా పరిధిని పెంచింది. చెన్నై మైలాపూర్ జిల్లాలో, ఇది “బాటిల్స్ ఫర్ ఛేంజ్ “కార్యక్రమం ద్వారా 21 రోజుల “రీసైకిల్ టు రివైవ్ మైలాయ్” సవాలును ప్రారంభించింది, ప్లాస్టిక్ వ్యర్థాల వేర్పాటును, సేకరణను ప్రోత్సహించింది.
 
తమిళనాడు క్లైమేట్ మిషన్, జిల్లా పరిపాలనా విభాగం భాగస్వామంతో ఊటీలో రీసైకిల్ చేసిన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించబడింది. స్థానిక కళాకారులు, ఔత్సాహికులు, విద్యార్థుల ద్వారా పర్యావరణానుకూలమైన ఆవిష్కరణలు ప్రదర్శించబడ్డాయి. తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కోయంబత్తూరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ల సహకారంతో మెగా ఎగ్జిబిషన్, హ్యాండ్ సిగ్నేచర్ కాంపైన్ కూడా నిర్వహించబడింది. అరసూర్, వెల్లనపట్టిలో 500కి పైగా మొక్కలు నాటబడ్డాయి. కోయంబత్తూరు అటవీ విభాగం భాగస్వామంతో మరుతమలై మురుగన్ ఆలయం శుభ్రపరిచే డ్రైవ్ కూడా నిర్వహించబడింది.
 
పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో, బిస్లెరి- శ్రీ వెంకటేశ్వర గ్రూప్ లు కలిసి మొక్కలు నాటాయి. అరియూర్, కరియమణికమ్ మరియు కరికలంపక్కంలో శుభ్రతా డ్రైవ్ నిర్వహించబడింది. పర్యావరణ చైతన్యాన్ని ప్రోత్సహించడానికి ఔలగరెట్ మునిసిపాలిటీలో 300 చదరపు అడుగుల “వాల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్” చిత్రం ప్రారంభించబడింది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ సేకరణ డ్రైవ్ కూడా జరిగింది. రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ కుండల్లో నాటిన మొక్కలను దీనిలో పాల్గొన్నవారు అందుకున్నారు, ఇది వలయాకారపు ఆర్థిక వ్యవస్థ నమూనాను తెలియచేసింది.
 
కర్ణాటకలో, విద్యా భాగస్వామాలు ద్వారా యువత నాయకత్వంవహించిన కార్యక్రమాలు వర్ధిల్లాయి. టెరేషియన్ కళాశాల విద్యార్థులు గ్రామాలు, పర్యాటక ప్రాంతాల్లో చైతన్య కార్యక్రమాలు, పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించారు, నాగార్జున కళాశాల పాఠశాలలు, సమాజాల్లో ప్లాస్టిక్ సేకరణ డ్రైవ్స్ ను నిర్వహించింది. బెంగళూరులో, నెక్సస్ మాల్ “రీసైకిల్ మరియు రిప్లెనిష్” కార్యక్రమంతో  ప్రజా సేకరణ పాయింట్‌ను ప్రారంభించింది. మైసూరు మహారాజ్ ఆవిష్కరించిన బిస్లెరి వారి “బెంచెస్ ఆఫ్ డ్రీమ్స్” ప్రారంభోత్సవాన్ని CFTRI నిర్వహించింది. నెల రోజుల ప్లాస్టిక్ సేకరణ డ్రైవ్‌ను మైసూరు సిటీ కార్పొరేషన్ ప్రారంభించింది.
 
యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో, మేఘా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్, ఒమేగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఘట్కేశర్లో ఒమేగా PG  కళాశాల నాయకత్వంలో కంపెనీ వారి శక్తివంతమైన విద్యా-సమాజ సహకారం ప్రభావవంతమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ సంస్థలు క్యాంపస్ లు, గ్రామాలు, జాతీయ రహదారి మార్గాలలో పెద్ద ఎత్తున పరిశుభ్రతా డ్రైవ్స్‌ను నిర్వహించాయి. 1,000కి పైగా మొక్కలను పోషించడానికి వాగ్థానంతో మొక్కలను నాటే ప్రయత్నాలను చేపట్టాయి. విద్యార్థుల నాయకత్వంలో చైతన్య ర్యాలీలు, వివిధ పట్టణ, గ్రామీణ ప్రజలతో ఇంటరాక్టివ్ నాటకాలు నిర్వహించబడ్డాయి. సుస్థిరత కోసం ఈ ప్రాంతపు అట్టడుగు స్థాయి నిబద్ధతను పునః శక్తివంతం చేయబడింది.
 
కే. గణేష్, డైరెక్టర్- సస్టైనబిలిటి & కార్పొరేట్ అఫైర్స్, బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, సమిష్టి చర్య కోసం అత్యవసర అవసరాన్ని చూపించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఒక అవకాశం కల్పిస్తోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే దిశగా తగిన చర్యలు తీసుకోవడానికి దక్షిణ భారతదేశం అంతటా మేము సమాజాలను సమీకరించినందుకు గర్విస్తున్నాం. ఈ కార్యక్రమాలు ద్వారా, మేము పర్యావరణ సవాళ్లను నిర్వహించడమే కాకుండా సుస్థిరమైన పద్ధతులను అనుసరించడానికి ప్రజలను ప్రత్యేకించి యువతను కూడా ప్రోత్సహిస్తున్నాం. కోస్తా తీరం నుండి అడవులను శుభ్రపరచడం వరకు సృజనాత్మక పునర్వినియోగం, సమాజం పాల్గొనడం వరకు, బాటిల్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం ద్వారా మా ప్రయత్నాలు అట్టడుగు వర్గాల సహకారంతో శాశ్వతమైన ప్రభావాన్ని ఎలా కలిగిస్తుందో చూపిస్తాయి.”