1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2015 (16:01 IST)

ఇప్పటివరకు రూ.12 వేల కోట్ల నల్లధనం స్వాధీనం

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు 12 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వాధీనం చేసుకుంది. నిజానికి మార్చి 2014 నుంచి 20 నెలల్లో రూ.16 వేల కోట్ల నల్లధనం గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, అధికారులు మాత్రం రూ.12 వేల కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ అథియా వెల్లడించారు. 
 
2014 మార్చి నుంచి 2015 నవంబరు వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసిన నల్లధనం వివరాలను ఆయన వెల్లడించారు. రూ.12 వేలు కోట్లు స్వాధీనం చేసుకోగా, 774 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇటీవల ప్రభుత్వం నల్లధనం స్వచ్ఛందంగా అందజేయడానికి ప్రత్యేకంగా విండో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విండో ద్వారా రూ.4,160కోట్లు మాత్రమే ప్రభుత్వానికి స్వాధీనం చేశారు.