గురువారం, 30 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 అక్టోబరు 2025 (13:16 IST)

Silver Loan: బంగారమే కాదు.. ఇకపై వెండి కూడా తాకట్టు పెట్టుకోవచ్చు.. ఆర్బీఐ కీలక నిర్ణయం

Silver
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం తరహాలోనే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. 
 
అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు.