1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (11:25 IST)

ముంబై రైల్వే స్టేషన్లో ఇన్‌స్టంట్ పిజ్జా వెండింగ్ మిషన్లు.. ఐదు నిమిషాల్లోనే పిజ్జా

పాశ్చాత్య పోకడల ప్రభావం భారతీయులపై బాగానే పడింది. విదేశీ మోజుతో డ్రెస్‌ కోడ్‌లో తేడాలొచ్చిన నేపథ్యంలో ఆహార విషయంలోనూ విదేశీ ఫుడ్‌కు భారతీయులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా విదేశీ ఫుడ్స్ అయిన పిజ్జా, బర్

పాశ్చాత్య పోకడల ప్రభావం భారతీయులపై బాగానే పడింది. విదేశీ మోజుతో డ్రెస్‌ కోడ్‌లో తేడాలొచ్చిన నేపథ్యంలో ఆహార విషయంలోనూ విదేశీ ఫుడ్‌కు భారతీయులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా విదేశీ ఫుడ్స్ అయిన పిజ్జా, బర్గర్లు దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. పిజ్జాకున్న క్రేజ్‌ను ప్రస్తుతం దేశంలోని వాణిజ్య సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటోంది.
 
ఇందులో భాగంగా ముంబయి రైల్వేస్టేషనల్లో ఇకపై పిజ్జా మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఆర్ సీటీసీ ముంబయి రైల్వేస్టేషన్లలో ఇన్ స్టాంట్ పిజ్జా వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుంది. ముంబైలోని సెంట్రల్, అంధేరీ, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కల్యాణ్, లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషనల్లో ఈ పిజ్జా మెషీన్లను ఏర్పాటు చేస్తారు. 
 
మెషిన్‌లో టోకెన్ పెట్టి నచ్చిన పిజ్జాను వినియోగదారులు సెలక్ట్ చేసుకోవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లో పిజ్జా తయారై బయటకు వస్తుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.