శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (10:09 IST)

రూ. 99.75 తగ్గిన వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలు

lpg cylinder
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలను రూ. 99.75 తగ్గించాయి, అయితే దేశీయ వంట గ్యాస్ సిలిండర్ల ధరలను యధాతథంగా ఉంచినట్లు వర్గాలు తెలిపాయి.
 
సవరించిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. ధరలు తగ్గిన తర్వాత, ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,680 అవుతుంది. వివిధ పన్ను స్లాబ్‌ల కారణంగా ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దేశీయ మార్కెట్‌లో ఎల్‌పిజి సిలిండర్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇకపోతే.. 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలు మార్చి 1 నుండి సవరించబడలేదు.