1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (11:01 IST)

ఇంటర్నెట్‌ను భలే వాడేస్తున్న భారతీయులు.. 2025 నాటికి..?

INTERNET
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరగిపోతోంది. ముఖ్యంగా మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతోంది. భారతదేశంలో దాదాపు 145 కోట్ల మందిలో సగం మంది అంటే 75 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 
 
ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 75 కోట్లు కాగా, 2025 నాటికి అది 90 కోట్లకు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అధ్యయనం ప్రకారం, 36 కోట్ల మంది పట్టణ ప్రాంతాల నుండి, 39 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల నుండి ఇంటర్నెట్ వాడుతున్నారు. దీనిని బట్టి పట్టణ ప్రాంతాల ప్రజల కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 
 
ప్రపంచ జనాభాలో 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు భారతీయులే కావడం గమనార్హం.