సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:27 IST)

ఫెరారో ఇండియా “కిండర్‌ క్రీమీ” లాంచ్‌

చాక్లెట్లు, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి తయారీదారుల్లో ఒకటైన ఫెరారో గ్రూప్‌లో భాగమైన ఫెరారో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, తన సరికొత్త సృజనాత్మక ఉత్పత్తి “కిండర్‌ క్రీమీ” లాంచ్‌ చేసి చిన్నారుల స్నాకింగ్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఈ కొత్త ఉత్పత్తి ద్వారా భారతదేశపు చాక్లెట్‌ కేటగిరిలో మూలమూలకు విస్తరించాలన్నది ఫెరారో ఇండియా లక్ష్యం. అగ్రశ్రేణి బ్రాండ్‌ కిండర్‌ కింద వస్తున్న కిండర్‌ క్రీమీ ఒక వినూత్నమైన ఉత్పత్తి. ఇది పాలతో కూడిన కరకరలాడే మినీ స్నాక్‌. ఇందులో పాలు, విటమిన్‌ B12 సమృద్ధిగా ఉన్నాయి. ప్రతీ స్కూప్‌ ఒక మల్టీ టెక్స్చర్‌ అనుభూతి అందిస్తుంది.
 
కిండర్‌ క్రీమీ ఒక ప్రత్యేకమైన రెసిపీ. రుచికరమైన పాలు, కోకో క్రీమ్‌, పైన కరకరలాడే రైస్‌తో పాటు అత్యుత్తమ పదార్థాలతో తయారైన ఈ నోరూరించే చాక్లెట్‌లో  ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కలరింగ్స్‌ లేవు. ఒక కిండర్‌ క్రీమీ (19 గ్రా)లో 22% పాలు, విటమిన్‌ B12 ఉన్నాయి. ప్రతీ చాక్లెట్‌లో 0.20 µg (మైక్రోగ్రాములు) విటమిన్‌ B12 ఉంటుంది. భారత వైద్య పరిశోధనా మండలి సిఫార్సు చేసిన ఆహార అలవెన్స్‌ (RDA)లో తెలిపిన మొత్తంలో ఇందులో 20% ఉంటుంది. టబ్‌ ఆకారంలో స్కూపర్‌తో కూడి ఉండే కిండర్‌ క్రీమీ, క్రీమ్‌, క్రంచ్‌, తొడిమ తీస్తున్న అనుభూతుల ప్రత్యేకమైన సమ్మేళనం. స్కూప్‌ చేయండి, ఆనందించండి.
 
సరసమైన ధరలో కిండర్‌ క్రీమీని ప్రవేశపెడుతున్నారు. దీని ధర రూ.20. ఆధునిక రిటైల్‌ దుకాణాలతో పాటు దక్షిణాదిన సంప్రదాయ దుకాణాల్లోనూ ఇది ఇప్పుడు అందుబాటులో ఉంది. అంతే కాదు వినియోగదారులు దీన్ని ఈ-కామర్స్‌ వేదికల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.
 
పెద్ద మార్కెట్‌ వ్యవస్థ కలిగిన దక్షిణ ప్రాంతం ఫెరారో ఇండియాకు చాలా ముఖ్యమైనది. కిండర్‌ ఉత్పత్తులపై ప్రేమ, నమ్మకం కలిగిన మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ఇప్పుడు కిండర్‌ క్రీమీ ద్వారా కంపెనీ మరో అడుగు వేస్తోంది.  ఈ విస్తరణ ద్వారా భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న స్నాకింగ్‌ శ్రేణిలోకి ఫెరారో అడుగుపెడుతోంది. పెరుగుతున్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, ఆ ఆకలి క్షణాల్లో తల్లి- చిన్నారుల మధ్య ఎడతెగకుండా సాగే చర్చకు ఈ రుచికరమైన స్నాక్‌తో ముగింపు పలకాలని ఈ బ్రాండ్‌ భావిస్తోంది. మైమరపించే చాక్లెట్‌ రుచి, పాలలోని మంచి గుణం కలగలిసిన కిండర్‌ క్రీమీ, పిల్లలకు అవసరయ్యే తగిన మోతాదు పోషకాలను అందిస్తుందని తల్లులకు భరోసా ఇస్తోంది.
 
ఈ సందర్భంగా ఫెరారో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్టీఫానో పెల్లె మాట్లాడుతూ, “ వినియోగదారులకు సరసమైన ధరలో ఒక ప్రత్యేకమైనది అందించాలనే ప్రయత్నంలో బాగంగా మేము కిండర్‌ క్రీమీతో మా కిండర్‌ పోర్టుఫోలియోను విస్తరిస్తున్నాం. ఇది మరో విజయవంతమైన మేడ్‌ ఇన్‌  ఇండియా చొరవ. అంతర్జాతీయంగా ఫెరారోకు భారత్‌ ప్రధాన మార్కెట్లలో ఒకటి. స్థానిక తయారీని పెంచడం, ముడి పదార్థాలను ఇక్కడి నుంచే సేకరించాలన్న మా నిబద్ధతకు అనుగుణంగా ఈ ఉత్పత్తి ఉంటుంది” అన్నారు.
 
 “ఈ ప్రాంతంలో మా విజయం, ప్రగతిని ఈ కొత్త ఉత్పత్తి ప్రతిబింబిస్తుంది. ఈ కిండర్‌ క్రీమీని కూడా వినియోగదారులు బాగా ఆదరిస్తారని, స్నాకింగ్‌ సెగ్మెంట్‌లో  పిల్లలకు ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినప్పుడు కూడా దీన్ని అందిస్తారని నమ్ముతున్నాం.”
 
వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులు అందించడమనే వారసత్వం కలిగిన మేము కిండర్‌ క్రీమీని పుణే సమీపంలోని బారామతి ప్లాంట్‌లో తయారు చేస్తున్నాం. దీనికి అవసరమైన ముడి సరుకును దాదాపు 80% స్థానికంగానే సేకరిస్తున్నాం. ఈ ప్లాంట్‌లో అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన  పరిశోధన & అభివృద్ధి కేంద్రం ఉంది. పదార్థాల మిక్స్‌, సరుకుల సేకరణ, ప్యాకేజింగ్‌, ప్రొడక్ట్ టెస్టింగ్‌ వంటి నాణ్యత పరీక్షలన్నింటినీ ఇది చేపడుతుంది.  అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తుల్లోని పోషక లక్షణాలను పదిలపరిచేలా చూసేందుకు ఫెరారో ఉత్తమమైన సమగ్ర నాణ్యత, ట్రేసబిలిటి విధానాలు అనుసరిస్తుంది.
 
కిండర్‌ క్రీమీ లాంచింగ్‌కు అనుబంధంగా బలమైన మార్కెటింగ్‌ ప్రచారం, మీడియా ప్లానింగ్‌ కూడా ఉంటుంది. టీవీ, డిజిటల్‌ మీడియాలో  ప్రచారంతో పాటు సాధారణ జనాలకు చేరువయ్యేందుకు తగిన ప్రచారాన్ని  బ్రాండ్‌ అనుసరిస్తుంది. ఈ ఉత్పత్తిపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు రిటెయిల్‌ దుకాణాల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మెటిరీయల్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో వ్యాపార భాగస్వాములు, వినియోగదారులకు శాంపిల్‌ అందించే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు.