శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:22 IST)

సుటిబ్‌‌ను ఆవిష్కరించిన గ్లెన్‌మార్క్‌: మూత్రపిండాల క్యాన్సర్‌ వృద్ధిని 58% తగ్గిస్తుంది

పరిశోధనాధారిత, అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ నేడు సుటిబ్‌ను ఆవిష్కరించింది. భారతదేశంలో మూత్రపిండాల క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి నోటి ద్వారా తీసుకునే సునిటినిబ్‌కు జనరిక్‌ వెర్షన్‌ ఇది. ఈ ఔషదాన్ని ఇన్నోవేటర్‌ బ్రాండ్‌ యొక్క గరిష్ట చిల్లర ధరతో పోలిస్తే 96% తక్కువ ధరకు అందిస్తున్నారు. నెలకు సుటిబ్‌ ధర 7వేల రూపాయలు (50ఎంజీ), 3600 రూపాయలు (25ఎంజీ), 1840 రూపాయలు (12.5 ఎంజీ).
 
గ్లోబోకాన్‌ 2020 నివేదిక ప్రకారం, భారతదేశంలో 40వేల మంది రోగులు భారతదేశంలో  మూత్రపిండాల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఓ దశాబ్ద కాలంగా, సునిటినిబ్‌ను అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మూత్రపిండాల క్యాన్సర్‌ చికిత్సలో అత్యున్నత ప్రమాణంగా వాడుతున్నారు. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ఒక్క సునిటినిబ్‌ ద్వారా మూత్రపిండాల క్యాన్సర్‌ వృద్ధిని 58% ఆపుతుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి శ్రీ అలోక్‌ మాలిక్‌, గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌, ఇండియా ఫార్ములేషన్స్‌ మాట్లాడుతూ, ‘‘గ్లెన్‌మార్క్‌ దృష్టి కేంద్రీకరించిన అతి ముఖ్యమైన విభాగాలలో ఆంకాలజీ ఒకటి. మూత్రపిండాల క్యాన్సర్‌ వృద్ధి అనేది అత్యంత క్లిష్టమైన సమస్య. భారతదేశంలో రోగులకు పరిమిత చికిత్సావకాశాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఫిజీషియన్లతో పాటుగా వారి రోగులకు అందుబాటు ధరలో ప్రభావవంతమైన ఔషదాలను తీసుకు రావడానికి గ్లెన్‌మార్క్‌ కట్టుబడి ఉంది’’ అని అన్నారు.