గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (14:34 IST)

ట్రిలియన్ మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు

పండగ సీజన్‌ పుణ్యమాని జీఎస్టీ వసూళ్లు రెట్టింపయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో జీఎస్టీ వసూళ్లు ట్రిలియన్ మార్క్‌ను అధిగమించాయి. 
 
గత నెల కంటే అక్టోబరు నెలలో 6.64 శాతం వసూళ్లు పెరిగి రూ.లక్షా 700 కోట్లకు చేరాయి. సీజీఎస్‌టీ రూ.16 వేల 464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.22 వేల 826 కోట్లుగా నమోదైంది. 
 
ఇక, ఐజీఎస్టీ వసూళ్లు రూ.53 వేల 419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ.26 వేల 908 కోట్లు, సెస్‌ రూపంలో రూ.8,000 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో కూడా లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.