అరవింద సమేత.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం అరవింద సమేత..వీర రాఘవ. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోస్ ద్వారా 800k, ఫస్ట్ డే $200k.. టోటల్‌గా 1 మిలియన్ వర్క్ సాధించింది. ఫస్ట్ వీకెండ్ కే 2 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తుందని సినీ పండితులు అంచనా.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాం - 5.73 కోట్లు, సీడెడ్ - 5.30 కోట్లు, గుంటూరు 4.14 కోట్లు, కృష్ణ - 1.97 కోట్లు, నెల్లూరు - 1.06 కోట్లు, వెస్ట్ - 2.05 కోట్లు, ఈస్ట్ - 2.77 కోట్లు, ఉత్తరాంధ్ర - 3.12 కోట్లు, టోటల్ ఆంధ్ర-తెలంగాణలో కలిపి 26.14 కోట్లు, కర్నాటక- 2.07 కోట్లు, ఆర్ఓఐ - 55లక్షలు, యుఎస్ఎ - 3.88 కోట్లు, ఆస్ట్రేలియా - 32 లక్షలు, యుఎఈ - 30 లక్షలు, ఆర్ఓడబ్ల్యూ - 20 లక్షలు. టోటల్‌గా అరవింద సమేత.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ - 33.49 కోట్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.