శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 15 అక్టోబరు 2018 (10:58 IST)

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'అరవింద సమేత'... మూడు రోజుల్లో...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం అరవింద సమేత. ఈ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. దసరా సెలవులు అలాగే ఇప్పట్లో పెద్ద చిత్రాల విడుదల లేనందున ఈచిత్రం మంచి వసూళ్లను సాధించనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మూడు రోజులకుగాను రూ. 40కోట్ల పైగా షేర్ వ‌సూలు చేసింది.
 
ఇక నైజాం ఏరియాలో ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 11.16 కోట్ల షేర్‌ను సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైన 3 రోజుల్లోనే ఈచిత్రం రూ.62కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్‌బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది. అయితే... దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలవుతున్న విశాల్ పందెంకోడి 2 అలాగే రామ్ హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు బాక్సాషీస్ వద్ద అరవింద సమేతకు ఎంత వ‌ర‌కు పోటీ ఇస్తాయో...? అర‌వింద స‌మేత ఫుల్ ర‌న్‌లో ఎంత సాధిస్తుందో చూడాలి.