శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 14 అక్టోబరు 2018 (14:28 IST)

నేను ట్యూన్స్‌ కాపీ కొట్టి ఉంటే 60 సినిమాలు చెయ్యగలిగేవాడినా?.. తమన్

తాను ట్యూన్స్ కాపీ కొడుతున్నట్టు వస్తున్న వార్తలపై టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్. థమన్ స్పందించారు. తాను ట్యూన్స్ కాపీ కొట్టేవాడినైతే 60 సినిమాలు చెయ్యగలిగేవాడినా అంటూ ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, 'ట్యూన్స్‌ కాపీ కొడుతున్నాననే విమర్శలను నేను పట్టించుకోను. ఇదే మాటను అగ్ర సంగీత దర్శకుల్ని ఎవరూ అడగలేరు. నేను కామ్‌గా ఉంటాను కాబట్టి నావి కాపీ ట్యూన్స్‌ అంటున్నారు' అని ఆవేదన వ్యక్తంచేశారు. జూ.ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. సినిమాకు, పాటలకు వస్తున్న స్పందనపై ఆయన స్పందించారు. 
 
'త్రివిక్రమ్‌తో పని చేయడం కోసం ఎనిమిదేళ్లగా ఎదురుగా చూస్తున్నా, నా కల అరవిందతో నెరవేరింది. త్రివిక్రమ్‌తో పని చేయడం వల్ల స్కూల్‌ నుంచీ కాలేజ్‌ వరకూ అప్‌గ్రేడ్‌ అయినట్టు భావిస్తున్నా. కమర్షియల్‌ సినిమా అంటే మాస్‌ సాంగ్‌, ఐటెమ్‌ నంబర్‌ అంటూ కొన్ని లెక్కలుంటాయి. వాటికి అతీతంగా ఈ సినిమాకు సంగీతం అందించా. ఈ రోజు అందరి ప్రశంసలు అందుకోవడానికి కారణం కథాబలం అని థమన్ వ్యాఖ్యానించారు.