ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2017 (16:38 IST)

ఇకపై ఆ ఆరు బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లవు..

ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్) కోడ్‌లు అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లవు అని ఎస్‌బీఐ గతంలోనే ప్రకటించిన

ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్) కోడ్‌లు అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లవు అని ఎస్‌బీఐ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని ఎస్‌బీఐ సూచించింది. 
 
కొత్త ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు పొందగలరని చెప్పింది. సదరు బ్యాంకు ఖాతాదారులు తక్షణమే కొత్త చెక్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా సొంత బ్యాంకు బ్రాంచీల ద్వారా కొత్త చెక్‌బుక్‌లను పొందవచ్చని తెలిపింది. 
 
కాగా, ఈ యేడాది ఆరంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనమైన విషయం విదితమే. ఈ బ్యాంకుల ఖాతాదారులు పాత చెక్‌బుక్‌లనే వాడుతున్నందు వల్ల కొత్త చెక్‌బుక్‌లు ఇవ్వాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.