సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (19:59 IST)

30 నిమిషాల్లో 16 స్టేషన్లు దాటిన మెట్రో రైలు, గుండె మార్పిడి కోసం Live Heartతో పరుగులు

బహుశా దేశంలోనే ఇదే మొదటిది కావచ్చు. గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా వైద్యులు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీనగర్‌ కామినేని నుంచి జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండెను తరలించారు. రైలు 16 స్టేషన్లు దాటుకుని 30 నిమిషాల్లో జూబ్లిహిల్స్ చేరుకుంది.
 
 
కాగా నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు.
 
అయితే ట్రాఫిక్‌ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున, నాగోల్ నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో పీఏ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా గుండె తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు.
 
ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు వీలుగా గ్రీన్‌ఛానల్‌ ద్వారా ఈ తరలింపు ప్రక్రియ చేపట్టారు. అయితే ట్రాఫిక్‌ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున... ఎల్బీ నగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌ వరకు రోడ్డుమార్గంలో... అనంతరం నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో తీసుకెళ్లారు.
 
నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డికి బ్రెయిన్‌డెడ్‌ అవడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. గుండెను శస్త్రచికిత్స ద్వారా వేరొకరికి అమర్చేందుకు అపోలో వైద్యులు ఏర్పాట్లు చేశారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు.