శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (09:02 IST)

స్నేహితుడి భార్యతో నగరానికి.. ప్రశ్నించిన భర్త తరఫు బంధువుపై దాడి

హైదరాబాద్ నగరంలో స్నేహితుడి భార్యతో ఓ వ్యక్తి నగరానికి వచ్చాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ భర్త తరపు బంధువును ప్రశ్నించాడు. అంతే.. అతనిపై దాడి చేయడంతో  మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన అంకిత్‌ శుక్లా, యోగేష్‌ అట్లా అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. యోగేష్‌ అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో వ్యాపారం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం ఇండోర్‌కు వెళ్లి స్నేహితుడైన అంకిత్‌ భార్యను నగరానికి తీసుకొచ్చాడు. 
 
వీరిద్దరూ కలిసి కుందన్‌బాగ్‌లో అద్దె ఇంట్లో ఉంచాడు. అంకిత్‌ తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కుందన్‌బాగ్‌లో ఉన్నట్టు గుర్తించారు. జనవరి 29న అంకిత్‌ అతని మామ విశ్వసుందర్‌ శుక్లా(65) నగరానికి వచ్చి యోగేష్‌ను నిలదీయగా శుక్లాపై చేయిచేసుకొని తోసివేశాడు.
 
తలకు తీవ్ర గాయమైన అతని ఉస్మానియాకు తరలించగా మరణించాడు. యోగేష్‌పై హత్యానేరం కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. అలాగే, అంకిత్ భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.