ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (20:21 IST)

హ్యుందాయ్ ఇండియా నుంచి కొత్త క్రెటా ఎన్ లైన్‌

Creta N Line
Creta N Line
హ్యుందాయ్ ఇండియా కొత్త క్రెటా ఎన్ లైన్‌ను రూ. 16.82 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఎన్8 ఎంటీ, ఎన్8 డీసీటీ, ఎన్10 ఎంటీ, N10 డీటీసీ. 
 
ఇక క్రెటా ఎన్ లైన్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కోసం మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికను తిరిగి తీసుకువస్తుంది. ఈ ఫీచర్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో లేదు. ఇది 1.5 టర్బో ఇంజిన్‌తో డీసీటీ ఎంపికను మాత్రమే అందిస్తుంది.
 
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ వేరియంట్ ధరలను చూద్దాం.. 
ఢిల్లీ షోరూమ్ ధరలు 
N8 MT - రూ 16.82 లక్షలు
N8 DCT - రూ 18.32 లక్షలు
N10 MT - రూ 19.34 లక్షలు
N10 DCT - రూ 20.29 లక్షలు