శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (14:52 IST)

మోడీ సర్కారు విధానాలతో దేశ అర్థిక వ్యవస్థ ధ్వంసం : బీజేపీ ఎంపీ

ప్రధానమంత్రి నరేంద్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుందంటూ ఆగ్రహం వ్యక్త

ప్రధానమంత్రి నరేంద్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. యశ్వంత్ సిన్హా మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 
 
'ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ' పేరిట ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఓ వ్యాసాన్ని రాశారు. ఇందులో నోట్లరద్దు, జీఎస్టీపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వమే దేశ ఆర్థిక వ్యవస్థను నట్టేట ముంచిందంటూ మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన తప్పులపై ఇంకా స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస‍్మరించినట్లేనని ఆయన ఆ కథనంలో అభిప్రాయపడ్డారు. 
 
సాక్షాత్తూ కేంద్రప్రభుత్వం చేసిన ఈ భారీ తప్పిదం వల్ల సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆయన చెప్పారు. జీడీపీ తగ్గడానికి కారణం సాంకేతిక కారణాలన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము ప్రతిపక్షంలో ఉండగా దర్యాప్తు సంస్థల దాడులను తీవ్రంగా ఖండిచేవారమన్నారు. అధికారం అండతో దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపైకి ఉసిగొల్పటం సరికాదని ఆయన ఆ కథనంలో సూచించారు.