1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 జనవరి 2024 (17:29 IST)

రూ.200 కోట్ల వరకు సెక్యూర్డ్, రీడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల పబ్లిక్ ఇష్యూను ప్రారంభించిన ఇండెల్ మనీ లిమిటెడ్

INDEL
గోల్డ్ లోన్ సెక్టార్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటైన ఇండెల్ మనీ లిమిటెడ్, రూ.1,000 ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ ఎన్‌సిడిల 4వ పబ్లిక్ ఇష్యూను ప్రకటించింది. ఈ ఇష్యూ ఈరోజు, అంటే జనవరి 30, 2024న తెరవబడుతుంది, ఫిబ్రవరి 12, 2024 సోమవారం నాడు ముగుస్తుంది.
 
ఇండల్ మనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ, “గోల్డ్ లోన్ పరిశ్రమలో మా స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి, మా కార్యకలాపాలను విస్తరించడానికి, మా పోటీతత్వ బలాలను ఉపయోగించుకోవడానికి మా వ్యాపార వ్యూహం రూపొందించబడింది. ఆర్థిక సంవత్సరం 2024 మొదటి అర్ధభాగంలో కంపెనీ లాభదాయకత రికార్డు స్థాయిలో 568.86% పెరగడం, బలమైన ఏయుఎం వృద్ధి, గోల్డ్ లోన్‌ల కోసం పెరిగిన డిమాండ్, సవాలుతో కూడిన వ్యాపార వాతావరణం ఉన్నప్పటికీ కొత్త ప్రాంతాలకు విస్తరణ, కార్యాచరణ సామర్థ్యాల కారణంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. కొత్త బ్రాంచ్‌లను తెరవడం ద్వారా మా బ్రాంచ్ నెట్‌వర్క్‌ని విస్తరించడం, మా లోన్ పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేయడం కొనసాగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. పెరిగిన రాబడి, లాభదాయకత, విజిబిలిటీ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను నడిపించే అంశాలు. ఈ ఇష్యూతో, మేము మా నిధుల వనరులను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు. 
 
ఇష్యూలో రూ.100 కోట్ల మొత్తానికి బేస్ ఇష్యూ సైజు ఉంటుంది, అలాగే రూ.100 కోట్ల వరకు ఓవర్-సబ్‌స్క్రిప్షన్‌ తో మొత్తం రూ.200 కోట్ల వరకు ఇష్యూ వుండే  అవకాశం ఉంది. ఇష్యూకి లీడ్ మేనేజర్ వివ్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులు, తదుపరి రుణాలు, ఫైనాన్సింగ్, కంపెనీ యొక్క రుణాలపై అసలు, వడ్డీని తిరిగి చెల్లించడం/ముందస్తు చెల్లింపు కోసం ఉపయోగించబడతాయి.