1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (13:54 IST)

ఉల్లి ధరలకు రెక్కలు.. ఎగుమతులపై కేంద్రం నిషేధం.. కారణం?

onion
దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ.50) దాటాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఉల్లి ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రజలకు తక్కువ ధరకే ఉల్లిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నిషేధం డిసెంబర్ 8 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఉల్లిని ఎగుమతి చేయవచ్చని, కొత్త ఎగుమతి చేయలేమని డీజీఎఫ్‌టీ ప్రకటించింది.ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకే ఉల్లి ఎగుమతి చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.