రైల్వే శాఖ కీలక నిర్ణయం... యూజర్ చార్జీల పెంపు
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ట్రైన్ టికెట్‌తో పాటు యూజర్ చార్జీలు కూడా వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ సంధర్భంగా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేయబోతున్నట్లు తెలిపారు.
కానీ ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే
అయితే ఈ ఛార్జీలతో కలుపుకుని ట్రైన్ టికెట్ ధర మరింత పెరిగనుందని వీకే యాదవ్ తెలిపారు. అంతేకాకుండా ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ ఛార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని అన్నారు. దేశంలో ఉన్న ఏడు వేల రైల్వే స్టేషన్లలో 10-15 శాతం స్టేషన్లలో ఈ చార్జీలను వసూలు చేస్తామని వీకే యాదవ్ వెల్లడించారు.