గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (11:16 IST)

ఇండిగో ఎయిర్‌లైన్స్ స్వీట్ 16 ఆఫర్...

indigo
ఇండిగో ఎయిర్‌లైన్స్ స్వీట్ 16 పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థను ప్రారంభించి 16 యేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్ బుక్ చేసుకునేవారు ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే యేడాది జూలై 16వ తేదీ మధ్య ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ఆఫర్ కింద శుక్రవారం లోపు టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ ఆఫర్ వివరాలను ఇండిగో సంస్థ స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకునే అవకాశాన్ని ఈ ఆఫర్ కల్పిస్తుందని వెల్లడించారు. అయితే, ఈ ఆఫర్ కింద ఎన్ని టిక్కెట్లు విక్రయించనున్నారో మాత్రం వెల్లడించారు.