JCB ఇండియా మూడు కొత్త ఎక్స్-కవేటర్లు లాంఛ్
ఎర్త్ మూవింగ్, కన్‌స్ట్రక్షన్ పరికరాల యొక్క భారతదేశపు ప్రముఖ తయారీదారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, క్వారీయింగ్ అప్లికేషన్ల కోసం మూడు కొత్త ఎక్స్‌కవేటర్లను నిన్న హైదరాబాద్‌లో లాంఛ్ చేసింది. ఈ మెషిన్లు పూణేలోని జెసిబి ఇండియాకి చెందిన అత్యాధునిక ఫ్యాక్టరీలో నిర్మించబడతాయి. భారతదేశంలోని కస్టమర్లకు మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లలో కూడా విక్రయించబడతాయి.
ప్రీమియం లైన్ అని పిలువబడే కొత్త సిరీస్‌లో JCBNXT 225LC M, JCB315LC HD, JCB385LC ఉన్నాయి. ఈ యంత్రాలు అత్యంత డిమాండ్ ఉన్న అప్లికేషన్లలో కఠినమైన, బలమైన భారతీయ ఆపరేటింగ్ పరిస్థితుల కోసం రూపొందించబడ్డాయి. ఇవి పెద్ద ఎత్తున ఎర్త్ వర్క్అప్లికేషన్లు, క్వారీలు, మైనింగ్ అప్లికేషన్లను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హైదరాబాద్ లోని వద్ద జరిగిన ఈవెంట్లో JCB NXT 225 LC డిస్ ప్లే చేయబడింది.
ఈ సందర్భంగా JCB ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ శెట్టి మాట్లాడుతూ, "రాబోయే దశాబ్దాల్లో భారతదేశం ప్రపంచానికి ఒక ఎదుగుదల చోదక శక్తిగా ఉండబోతోంది. ఈ వృద్ధిలో ఎక్కువ భాగం దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి నుండి వస్తుంది. గణనీయమైన జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ప్రోత్సాహకరమైన వేగాన్ని పొందుతున్నాయి. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద, మరింత ఉత్పాదక యంత్రాలు అవసరం అవుతాయి, మరియు ఈ కొత్త శ్రేణి ఎక్స్ కవేటర్లు ఆ అవసరాన్ని పరిష్కరిస్తాయి. భారత్ మాల, సాగరమాల, కొత్త పోర్టులు, లాజిస్టిక్ హబ్లు వంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను సృష్టిస్తాయి.