గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 31 జనవరి 2023 (17:45 IST)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణలో మరో 9 నగరాలలో జియో ట్రూ 5జీ సేవ‌లు ప్రారంభం

image
రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణలోని మరో 9 పట్టణాల్లో విస్తరించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్, నంద్యాల, తెనాలి; తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్ నగర్. రామగుండం నగరాలలో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. 
 
ఇప్పటికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
 
ఈ విస్తరణతో ఏపీలోని 22 నగరాలు, తెలంగాణలోని 9 నగరాలలోని వినియోగదారులకు జియో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు, జియో దేశవ్యాప్తంగా 34 నగరాలలో తన ట్రూ 5జీ సేవలను మంగళవారం అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనితో, 225 నగరాల్లోని జియో వినియోగదారులు ఇప్పుడు ట్రూ 5G సేవలను ఆస్వాదించనున్నారు.
 
రిలయన్స్ జియో ఈ నగరాల్లో 5G సేవలను ప్రారంభించిన మొదటి ఆపరేటర్‌గా అవతరించింది. ఈ నగరాల్లోని జియో వినియోగదారులు ఈ రోజు నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు జియో వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానించబడతారు.
 
ఈ సందర్భంగా జియో ప్రతినిధి మాట్లాడుతూ ‘’తెలుగు రాష్ట్రాలలో జియో ట్రూ 5జీని విస్తరించడం సంతోషంగా ఉంది. ఇప్పుడు జియో ట్రూ 5జీ సేవలు దేశవ్యాప్తంగా 225 నగరాలకు అందుబాటులోకి వచ్చాయి. బీటా ట్రయల్ ప్రారంభించినప్పటి నుండి కేవలం 120 రోజులలోపు జియో ఈ మైలురాయిని సాధించింది. డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. మన దేశాన్ని డిజిటలైజ్ చేయాలనే మా తపనకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.”