మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 అక్టోబరు 2024 (23:07 IST)

అనంతపురంలో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్‌

gold
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ అనంతపురంలో సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించనున్నట్లు ఈరోజు ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున అక్టోబర్ 22 (మంగళవారం) ఉదయం 11:30 గంటలకు సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం, ఈ ఆభరణాల బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప వంటి అన్ని ప్రధాన మార్కెట్‌లతో సహా అనేక ప్రదేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ  షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఆభరణాల కలెక్షన్ల నుండి విస్తృత శ్రేణి డిజైన్‌లు ప్రదర్శించనున్నారు.
 
షోరూమ్ ప్రారంభం గురించి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “అనంతపూర్‌లోని సరికొత్త షోరూమ్ ఈ ప్రాంతంలో కంపెనీ మార్కెట్ ఉనికిని పెంచడంలో మాకు సహాయం చేయనుంది. కళ్యాణ్ జ్యువెలర్స్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్లప్పుడూ ఒక కీలకమైన మార్కెట్‌గా వెలుగొందుతుంది. ఈ ప్రాంతంలో మా కొత్త పెట్టుబడులు మా కస్టమర్‌లకు ఉత్తమమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కొనసాగించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయి" అని అన్నారు.
 
ఈ ప్రారంభం పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ అనేక అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. తమ ఆభరణాల కొనుగోళ్లపై గణనీయమైన పొదుపును పొందే అవకాశాన్ని వినియోగదారులకు అందించనుంది. దీపావళి బొనాంజా ఆఫర్‌లో భాగంగా, కస్టమర్‌లు సాదా బంగారు ఆభరణాల కోసం మేకింగ్ ఛార్జీలపై 45% వరకు తగ్గింపును పొందగలరు. ప్రీమియం ఉత్పత్తుల కోసం, మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు వర్తిస్తుంది, టెంపుల్ మరియు యాంటిక్ ఆభరణాల కోసం మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 35% తగ్గింపును అందిస్తోంది. షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లలో 30 గ్రాముల లోపు అన్ని ఆభరణాల వస్తువులపై మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు అందిస్తుంది. ఇవి  కాకుండా, కళ్యాణ్ స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేట్‌ను సైతం అందిస్తుంది.