శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (19:40 IST)

భారతీయ మార్కెట్లోకి Kawasaki Z900

Kawasaki Z900
Kawasaki Z900
భారతీయ మార్కెట్లోకి 'కవాసకి జెడ్900' (Kawasaki Z900) విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 8.93 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి జెడ్900 దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కూడా రూ. 51,000 ఎక్కువ ధర కలిగి ఉంటుంది.
 
ఇది రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్/మెటాలిక్ కార్బన్ గ్రే లేదా ఎబోనీ/మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్స్. ఇవి రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఈ రెండు కలర్ వేరియంట్ ధరలు ఒకేలా ఉంటాయి. 
 
 
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో కలర్ TFT డిస్ప్లే అందుబాటులో ఉంటుంది. ఇందులో బైక్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఇది బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.  
 
కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్‌ అదే 998 సిసి, 4-సిలిండర్, డిఓహెచ్‌సి ఇంజన్‌ను పొందుతుంది. ఇది 13,200 ఆర్‌పిఎమ్ వద్ద 200.2 బిహెచ్‌పి పవర్ మరియు 11,400 ఆర్‌పిఎమ్ వద్ద 114.9 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది