‘అత్యధిక మైలేజీ పొందండి లేదా ట్రక్‌ను తిరిగివ్వండి’ హామీని ప్రకటించిన మహీంద్రా
మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా యెక్క ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీ) తమ వినూత్నమైన మరియు ప్రత్యేకత కలిగిన వినియోగదారుల విలువ ప్రతిపాదన అధిక మైలేజీ పొందండి లేదా ట్రక్‌ను తిరిగి చెల్లించండి ను ప్రకటించింది. మహీంద్రా యొక్క మొత్తం బీఎస్ 6 శ్రేణి బ్లాజో ఎక్స్ హెవీ, ఫ్యురియో ఇంటర్మీడియట్ మరియు ఫ్యూరియో 7, జయో సహా తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్‌లపై కూడా ఈ గ్యారెంటీ పథకం అందుబాటులో ఉంటుంది.
ఈ నూతన శ్రేణిలో నిరూపితమైన 7.2 లీటర్ ఎంపవర్ ఇంజిన్ (హెచ్‌సీవీలలు) మరియు ఎండీఐ టెక్ ఇంజిన్ (ఐఎల్‌ఎసీవీ)లు ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతికత, అతి తక్కువ యాడ్ బ్లూ వినియోగం మరియు మరెన్నో సాంకేతికంగా అత్యాధునిక ఆవిష్కరణలను సాధ్యం చేసేందుకు నిరూపిత బోష్ ఆఫ్టర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్‌తో మైల్డ్ ఈజీఆర్‌తో పాటుగా విప్లవాత్మక ఐమ్యాక్స్ టెలిమాటిక్స్ సొల్యూషన్ వంటివి ఖచ్చితమైన రీతిలో అత్యధిక మైలేజీకి భరోసా అందిస్తాయి. రవాణాదారులకు నిర్వహణ వ్యయంలో అత్యధిక వాటా (60%కు పైగా) ఇంధన ఖర్చులే ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని మహీంద్రా బీఎస్ 6 ట్రక్ శ్రేణిని ఈ పోటీతత్త్వ ప్రయోజనంతో తీర్చిదిద్దారు. ఇది వారికి ప్రయోజనం కలిగించడంతో పాటుగా పూర్తి స్థాయి మనశ్శాంతిని మరియు అత్యధిక సంపదను అందిస్తూ వారి వ్యాపారాలను పెంచుకునేందుకు తగిన అవకాశాలనూ అందిస్తుంది.
ఈ సందర్భంగా వీజెనక్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆటోమోటివ్ సెక్టార్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మాట్లాడుతూ అధిక మైలేజీ పొందండి లేదా ట్రక్‌ను తిరిగివ్వండి గ్యారెంటీని విస్తృత శ్రేణి ట్రక్‌ల వ్యాప్తంగా అందించడమనేది తేలికపాటి, మధ్యంతర మరియు భారీ వాణిజ్య వాహన పరిశ్రమలో ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలుస్తుంది. వేగంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ వినియోగదారుల విలువ ప్రతిపాదనను పరిచయం చేయడానికి దీనికి మించిన ఉత్తమమైన సమయం లేదు. సాంకేతికంగా అత్యాధునిరమైన, తమ శ్రేణిలో ఉన్నతమైన ఉత్పత్తులు సృష్టించడంలో మహీంద్రా సామర్థ్యం పట్ల వినియోగదారుల నమ్మకాన్ని ఇది పునరుద్ఘాటిస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఇది భారతీయ వాణిజ్య వాహన పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తూనే ఈ విభాగం పట్ల మా నిబద్ధతనూ ప్రతిబింబించనుంది అని అన్నారు.
జలజ్ గుప్తా, బిజినెస్ హెడ్, కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ యూనిట్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మాట్లాడుతూ ఈ మైలేజీ గ్యారెంటీ, అధిక మైలేజీ పొందండి లేదా ట్రక్‌ను తిరిగి ఇవ్వండి హామీని మొదటిగా మా హెచ్‌సీవీ ట్రక్ బ్లాజోపై 2016లో అందించాము. ఇప్పటి వరకూ ఒక్క ట్రక్ కూడా తిరిగి వెనక్కి రాలేదు. అప్పటి నుంచి మేము ఆవిష్కరించిన ప్రతి వాహనమూ అంటే బ్లాజో ఎక్స్, ఫ్యురియో ఐసీవీ శ్రేణి మరియు ఫ్యురియో 7 లు అత్యధిక ఇంధన సామర్థ్యం అందిస్తున్నాయి. ఇది మహీంద్రా యొక్క అత్యున్నత సాంకేతిక శక్తి , భారతీయ వినియోగదారులను అర్థం చేసుకున్న తీరును వివరిస్తుంది. అదనంగా ఎంటీబీ ఇప్పుడు సర్వీస్‌గ్యారెంటీ సైతం అందిస్తుంది.
వాహనాలు హైవేపై ఉన్నా లేదంటే డీలర్‌షిప్ వర్క్ షాప్ వద్ద ఉన్నా సరే ఇది మా వినియోగదారులకు ట్రక్‌ను ఖచ్చితంగా నిర్థేశించిన సమయంలో తిరిగి అందించగలమనే హామీతో అత్యధిక అప్‌టైమ్ అందిస్తుంది. అత్యాధునిక ఐమ్యాక్స్ టెలిమ్యాటిక్స్ టక్నాలజీతో మరింతగా యాజమాన్య నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటుగా తమ ట్రక్స్‌పై ట్రాన్స్‌పోర్టర్‌కు పూర్తి నియంత్రణను సైతం అందిస్తుంది. వీటితో పాటుగా హామీఇవ్వబడిన అత్యధిక మైలేజీ మా వినియోగదారులకు అత్యధిక సంపదకూ భరోసా అందిస్తుంది అని అన్నారు.