ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (21:29 IST)

ఎంఆర్ఎఫ్ టైర్స్, ప్రపంచంలోనే రెండవ అత్యంత పటిష్టమైన టైర్ బ్రాండ్

Tyres
ప్రపంచంలో అత్యంత విలువైన మరియు పటిష్టమైన టైర్ బ్రాండ్లపై బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన టైర్ బ్రాండ్‌గా ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ ఆవిర్భవించింది. దాదాపు అన్ని పరామితుల్లోనూ అత్యధిక స్కోర్‌ను ఎంఆర్ఎఫ్ సాధించింది, అలాగే ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రెండవ టైర్ల బ్రాండ్‌గానూ నిలిచింది. బ్రాండ్ పటిష్టతలో 100కి 83.2 స్కోరును ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ సాధించింది, ఎఎఎఫ్-బ్రాండ్ రేటింగ్‌ను అందుకుంది.
 
భారతదేశంలో అత్యంత విలువైన టైర్ల బ్రాండ్‌గానూ ఎంఆర్ఎఫ్ ఘనత సాధించింది, సస్టెయినబుల్ పర్సెప్షన్ వాల్యూలో అత్యధిక స్కోరును సాధించింది, టాప్‌ 10లో నిలిచిన ఏకైక భారతీయ టైర్ల తయారీదారుగానూ ఘనత సాధించింది.
 
అత్యంత విలువైన మరియు పటిష్టమైన ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్, టైర్లు & మొబిలిటీ 2023పై బ్రాండ్ ఫైనాన్స్ వార్షిక నివేదిక ఈ పరిశ్రమలోని బ్రాండ్ల విలువను విశ్లేషిస్తుంది. బహిరంగ మార్కెట్‌లో బ్రాండ్ లైసెన్సింగ్ ద్వారా ఒక బ్రాండ్ యజమాని సాధించే నిరక ఆర్థిక ప్రయోజనంపై బ్రాండ్ వాల్యూ అవగాహన కలిపిస్తుంది. మార్కెటింగ్ పెట్టుబడులు, స్టాక్ ఈక్విటీ, వ్యాపారం పనితీరుల్లాంటి అంశాల సమతుల్యమైన స్కోర్‌కార్డ్ ద్వారా బ్రాండ్ పటిష్టతను మదింపు చేయడం జరుగుతుంది, బ్రాండ్ ద్వారా వ్యాపార ఆదాయం నిష్పత్తిని నిర్ధారించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఆధారం: బ్రాండ్ డైరెక్టరీ డాట్ కామ్