బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (07:52 IST)

వార్షిక సభ్యత్వాన్ని పెంచిన అమెజాన్ - 60 శాతం తగ్గించి నెట్‌ఫ్లిక్స్

ఇటీవలి కాలంలో ఓటీటీల హవా కొనసాగుతోంది. అమెజాన్, జీ5, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కొన్ని ప్రైవేటు ఓటీటీలు కూడా ఉన్నాయి. వీటి సేవలు పొందాలంటే వార్షిక చందా చెల్లించాల్సి వుంటుంది. అయితే, అమెజాన్ వంటి కొన్ని ఒటీటీ కంపెనీలు తమ వార్షిక చందాను భారీగా పెంచింది. 
 
కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం దీన్ని భారీగా తగ్గించింది. దేశీయ ఓటీటీ మార్కెట్‌లో ఏర్పడిన పోటీ కారణంగా ఈ ధరలను 60 శాతం మేరకు తగ్గినట్టు పేర్కొంది. ప్రస్తుతం అమెజాన్ మాత్రం దేశీయ మార్కెట్‌‍లో ధరలను ఏకంగా 50 శాతం మేరకు పెంచుతూ వార్షిక చందాను రూ.1499కు చేర్చింది. అలాగే, నెలసరి, త్రైమాసిక ధరలను కూడా పెంచింది. 
 
అయితే, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వార్షిక చందా మాత్రం రూ.899కే లభ్యమవుతుంది. అదేసమయంలో నెట్‌ఫ్లిక్స్ మాత్రం మంగళవారం వివిధ నెలల సబ్‌స్క్రిప్షన్ ధలను భారీగా తగ్గించింది. ఈ తగ్గింపు గరిష్టంగా 60 శాతం మేరకు ఉండటం గమనార్హం. పైగా, ఈ తగ్గించిన ధరలు తక్షణం అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.