గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (16:01 IST)

నెట్‌ఫ్లిక్స్ ఇండియా విడుద‌ల చేసిన వెంకీమామ ఓల్డ్ లుక్‌

Venkatesh - netflix look
సినిమాల‌తోపాటు నెట్‌ఫ్లిక్స్ లో ఓ వెబ్‌సిరీస్ వెంక‌టేష్ చేస్తున్నారు. ఆమ‌ధ్య దృశ్యం2 ప్ర‌మోష‌న్‌లో భాగంగా అందుకు సంబంధించిన లుక్‌ను ఆయ‌న చూపించారు కూడా. అందులో గోల్డ్ హెయిర్‌తో తెల్ల‌టి డ్రెస్‌లో వున్నాడు. దాన్ని నెట్‌ఫ్లిక్స్ వారే విడుద‌ల‌చేయాల‌ని చెప్పొకొచ్చారు.
 
కాగా, సోమ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వెంకీ ఎల్డ్‌లుక్ ట్విట్ట‌ర్‌లో విడుద‌ల‌చేశారు. వెంకీకి శుభాకాంక్షలు తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ చిత్రాన్ని షేర్ చేసి “ఇంతకీ ఏమొచ్చు? ఫ్రెండ్స్ తో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా వెంకీ మామ సినిమాలూ ఎంజాయ్ చేయడం వచ్చు. శైలి ఏదైనా, భావోద్వేగం ఏదైనా ఒకే పేరు. పుట్టినరోజు శుభాకాంక్షలు వెంకీ మామా…” అంటూ ట్వీట్ చేశారు. 
 
దీనిని రీట్వీట్ చేస్తూ రానా “నాకు ఇది ఇష్టం… ఏదైనా జానర్, ఏదైనా ఎమోషన్, సింగిల్ నేమ్ వెంకీ” అంటూ కామెంట్ చేశారు.కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ‘రానా నాయుడు’ ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనోవన్’కి భారతీయ అనుకరణగా రూపొందుతోంది. అలాగే బాబాయ్ వెంకీ, అబ్బాయి రానా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ వచ్చే ఏడాది నుంచి వెబ్ సిరీస్‌ను ప్రసారం చేయనుంది.