శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (14:12 IST)

టోల్ ప్లాజా రేట్ల బాదుడు : కిలోమీటర్లు ఆధారంగా ఛార్జీలు

ప్రస్తుతం జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడిపోతున్నారు. పెట్రోల్‌కు అయ్యే ఖర్చుల కంటే టోల్ ప్లాజాల వద్ద చెల్లించే మొత్తం తడిసి మోపడవుతోంది. ఫలితంగా హైవే ఎక్కాలంటేనే వాహన యజమానులు బెంబేలెత

ప్రస్తుతం జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడిపోతున్నారు. పెట్రోల్‌కు అయ్యే ఖర్చుల కంటే టోల్ ప్లాజాల వద్ద చెల్లించే మొత్తం తడిసి మోపడవుతోంది. ఫలితంగా హైవే ఎక్కాలంటేనే వాహన యజమానులు బెంబేలెత్తిపోతున్నారు.
 
దీంతో టోల్ ప్లాజాలను ఎత్తివేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే సంకేతాలు ఇచ్చింది. అయితే, ఇపుడు మాట మార్చింది. అలాంటిదేమీ లేదని చెబుతూ మరో బాంబ్ పేల్చింది. పైగా, టాల్ రేట్లను వసూలు చేసేందుకు కొత్త విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి యుధ్‌వీర్ సింగ్ మాలిక్ బాంబు పేల్చారు. 
 
ఇక నుంచి ప్రయాణించే దూరం ఆధారంగా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. దూరాన్ని బట్టి టోల్ రేటు వసూలు చేసే విధానంపై తీవ్రంగా కసరత్తు జరుగుతుందని, త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. దూరాన్ని ఎలా లెక్కిస్తారు.. కిలోమీటర్‌కు ఎంత వసూలు చేస్తారు అనే విషయాలను ఆయన వెల్లడించలేదు. అన్నింటికీ త్వరలోనే సమాధానం వస్తుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎంట్రీ, ఎగ్జిట్ ఆధారంగా టోల్ రేటు వసూలు చేస్తున్నారు. ఇలాంటి తరహాలోనే జాతీయ రహదారులపై అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.