శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:45 IST)

ఆటాడుకునే నోటు కాదు... కొత్త రూ.20 నోటు... చూడండి మరి...

కరెన్సీ నోట్లకు ఇచ్చిన రంగులపై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రూ. 2000, రూ. 50 నోట్లతో పాటు మరికొన్ని నోట్లు చిన్నపిల్లలు ఆడుకునే ప్లేయింగ్ నోట్లంటూ విమర్శలు వచ్చాయి. ఆ సంగతి అలా వుంచితే తాజాగా ఆర్బీఐ రూ. 20 నోటుని విడుదల చేస్తోంది. ఈ నోటు లేత ఆకుపచ్చ రంగులో వుండి దానిపై కొత్త ఆర్టీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది.
 
రూ. 20 నోటుపై ముందు భాగంలో గాంధీజీ దర్శనమిస్తుండగా ప్రక్కనే అశోకుడి స్థూపం వుంది. మైక్రో లెటర్స్ రూపంలో ఆర్బీఐ, భారత్, ఇండియా అనేవి వున్నాయి. నోటు వెనక భాగంలో ఎల్లోరా గుహలకు సంబంధించిన బొమ్మ ఉంది. కాగా ఈ కొత్త నోటు వచ్చినా పాత రూ. 20 నోటు చెలామణిలోనే వుంటుందని వెల్లడించింది ఆర్బీఐ.