సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2023 (12:13 IST)

మంచి దృష్టి ప్రాముఖ్యతపై అవగాహన పెంచేందుకు వన్ సైట్ ఎస్సిలార్ లగ్జోటికాతో కలిసి పనిచేయనున్న ఓక్లీ- రోహిత్ శర్మ

Rohit
ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐవేర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఓక్లీ. అలాగే తన అత్యద్భుత ప్రదర్శనతో భారతీయ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు రోహిత్ శర్మ. అంతేకాదు ఓక్లీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉన్నాడు రోహిత్. ఇప్పుడు ఓక్లీ మరియు రోహిత్ శర్మ... వన్ సైట్ ఎస్సిలార్ లగ్జోటిగాతో కలిసి పనిచేయనున్నారు. మంచి దృష్టి యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం మరియు దృష్టి సంరక్షణ సరిగ్గా లేని ప్రాంతాల్లో దాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా రోహిత్ మరియు ఓక్లీ కలిసి పనిచేయనున్నారు.
 
ఒక రోజు మొత్తం పూర్తిగా గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో 10- 15 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 1000 మంది పాఠశాలకు వెళ్లని పిల్లలు యొక్క దృష్టిని పరీక్షించారు. ఈ సందర్భంగా దృష్టికి సంబంధింన చికిత్స అవసరమని గుర్తించిన పిల్లలకు వారి ప్రిస్క్రిప్షన్‌తో తయారు చేసిన లెన్స్‌‌లతో అమర్చిన ఓక్లీ కళ్లద్దాలను ఉచితంగా అందించారు.
 
మంచి దృష్టి అనేది ప్రాథమిక హక్కు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 2.7 బిలియన్ల మంది ప్రజలను కంటి లోపాలతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒక్కరికి 80 శాతం చికిత్స ద్వారా కంటి చూపు నయం చేయవచ్చు. కానీ వారికి ఆ అవగాహన లేకపోవడం, చికత్సను కూడా అందిపుచ్చుకునే పరిస్థితుల్లో ఉండడం పెద్ద సమస్యగా మారింది. స్పష్టమైన చూపు లేకపోవడం వల్ల నేర్చుకోవడం, ఉద్యోగ పనితీరు మరియు సంపాదన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. స్పష్టమైన చూపు ఉన్న విద్యార్థులు తమ పాఠశాలలో రెండు రెట్లు ఎక్కువ నేర్చుకోవడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కార్మికుల ఉత్పాదకతను 35 శాతం పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా వారు 20 శాతం ఎక్కువ సంపాదించవచ్చు. కంటి పరీక్షలు మరియు అద్దాలు వల్ల విద్య మరియు ఉపాధిని పెంపొందించుకోవడం ద్వారా ద్వారా ప్రజలను పేదరికం నుండి బయటపడేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించగల శక్తివంతమైన సాధనాలుగా పనిచేస్తాయి.
 
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న పిల్లలతో ఇంటరాక్టివ్ ఎక్స్‌ క్లూజివ్ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరి కలను నెరవేర్చడంలో, ముఖ్యంగా క్రీడలలో మంచి చూపు యొక్క ప్రాముఖ్యతను రోహిత్ శర్మ నొక్కిచెప్పాడు. అంతేకాకుండా తన జీవితకాలపు కథలను పంచుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ పిల్లలతో కలిసి క్రీడా కార్యక్రమాలలో నిమగ్నమయ్యాడు.
 
ఈ కార్యక్రమంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ, “దృష్టి సంరక్షణ అనేది ప్రతీ క్షణం చాలా అవసరం. ఓక్లీ మరియు వన్‌సైట్ ద్వారా ఈ సాధికారత కార్యక్రమంలో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలలో దృష్టి దిద్దుబాటు గురించి అవగాహన కల్పించడంలో ఈ చొరవ సరైన అడుగు. మన పిల్లలకు దృష్టి సంరక్షణ ముందస్తు/సకాలంలో అందిస్తే... వారు తమ భవిష్యత్తును నిర్మించడంలో మరియు సురక్షితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓక్లీతో మా కమ్యూనిటీకి ఒక వైవిధ్యాన్ని తీసుకురావడంలో నా వంతు కృషి చేస్తున్నందుకు నేను ఆనందంగా భావిస్తున్నాను అని అన్నాడు.
 
"అందరికీ దృష్టి సంరక్షణ అవకాశాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ముఖ్యంగా పిల్లలలో ఎక్కువ దృష్టి కేంద్రీకరించాము. దీంతో ఇది వారి అభివృద్ధి మరియు భవిష్యత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వన్ సైట్ ఎస్సిలార్ లగ్జోటికా ఫౌండేషన్ తో మేము విజన్ కేర్ యాక్సెస్‌బిలిటీకి ఆటంకం కలిగించే అడ్డంకులను పరిష్కరించడానికి మరియు అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. మేము మహారాష్ట్ర, గోవా, కర్ణాటక , జమ్మూ అండ్ కశ్మీర్ లాంటి రాష్ట్రాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాము. తద్వారా నాణ్యమైన కంటి సంరక్షణ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. దృష్టి సంరక్షణ కార్యక్రమాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తు కోసం మేము మావంతు సహకారాన్ని అందిస్తున్నాము అని అన్నారు ఎస్సిలార్ లగ్జోటికా దక్షిణాసియా అధ్యక్షుడు శ్రీ నరసింహన్ నారాయణన్.
 
 “రోహిత్ శర్మ, ఓక్లీ ఫౌండేషన్ మధ్య ఈ సహకారం.. దృష్టి సంరక్షణ మరియు క్రీడా శక్తిని పెంచడం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మా నిబద్ధతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా దృష్టి సంరక్షణకు ప్రాముఖ్యతను పెంచుతూ, మా ప్రయత్నాలను కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నాము అని అన్నారు ఎస్సిలార్ లగ్జోటికా మిషన్ హెడ్ మరియు వన్ సైట్ ఎస్సిలార్ లగ్గోటికా ఫౌండేషన్ అధ్యక్షుడు అనురాగ్ హన్స్. ఓక్లీ, రోహిత్ శర్మ మరియు వన్ సైట్ ఎస్సిలార్ లగ్జోటికా ఫౌండేషన్ మధ్య సహకారం దృష్టి సంరక్షణ, క్రీడల పరివర్తన శక్తిని ప్రోత్సహించడం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తుంది. మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటకలోని ప్రభుత్వాల మద్దతుతో, వన్ సైట్ ఎస్సిలార్ లగ్జోటికా ఫౌండేషన్‌కు మద్దతుగా కొనసాగుతుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలకు దృష్టి పరీక్షలు మరియు అద్దాలు అందిస్తూ 1,000 మంది పిల్లలను చేరుకోవాలనే లక్ష్యంతో మరింత ముందుకు కొనసాగుతున్నారు.