గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 ఏప్రియల్ 2023 (18:25 IST)

తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శివమ్‌ దూబేను ప్రకటించిన పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌

Dubey
మార్చి 31న ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌ 2023 ప్రారంభం కావడంతో, సుప్రసిద్ధ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌ పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌, తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శివమ్‌ దూబేను ఎన్నుకున్నట్లు వెల్లడించింది. శివమ్‌ దూబే అద్భుతమైన ఆల్‌రౌండర్‌. ఐపీఎల్‌ 2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున అతను ఆడుతున్నాడు. క్లీన్‌ హిట్టర్‌గా అత్యద్భుతమైన రికార్డు కలిగిన శివమ్‌కు అభిమానగణం కూడా అధికంగానే ఉంది.
 
తాను పరిమ్యాచ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడం గురించి శివమ్‌ మాట్లాడుతూ, ‘‘స్పోర్ట్స్‌ ఎటైర్‌లో సుప్రసిద్ధమైన పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. గేమ్‌లో అంతర్భాగంగా స్పోర్ట్స్‌వేర్‌ నిలువడంతో పాటుగా సౌకర్యమూ అందిస్తుంది. యూత్‌ఫుల్‌ బ్రాండ్‌ కావడం చేత, నేను ఈ బ్రాండ్‌తో నేను పూర్తిగా అనుబంధం పెంచుకున్నాను. శైలి, సౌకర్యంను అత్యద్భుతంగా ఇది మిళితం చేస్తుంది’’ అని అన్నారు
 
పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌‌తో శివమ్‌ బంధం గురించి కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘పరిమ్యాచ్‌ క్రీడా కుటుంబంలో శివమ్‌ దూబే భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాము. తన క్రీడలో అత్యద్భుతమైన ప్రతిభను అతను చూపుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెటింగ్‌ సెన్సేషన్‌గా అతను నిలిచాడు’’ అని అన్నారు.