బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 నవంబరు 2017 (17:16 IST)

భీమ్ యూపీఐని ప్రారంభించిన పేటీఎం... దేశపు అతిపెద్ద యూపీఐ ఐడీ జారీదారుగా...

భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల వేదిక పేటీఎం తన వేదికపై భీమ్ యూపీఐని ఉపయోగిస్తూ చెల్లింపులు చేయడాన్ని ప్రవేశపెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన యూజర్లు తమ సొంత పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని తయారు చేసుకోవచ్చు. పేటీఎం యూజర్లు తమ ఏదైనా సేవింగ

భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల వేదిక పేటీఎం తన వేదికపై భీమ్ యూపీఐని ఉపయోగిస్తూ చెల్లింపులు చేయడాన్ని ప్రవేశపెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన యూజర్లు తమ సొంత పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని తయారు చేసుకోవచ్చు. పేటీఎం యూజర్లు తమ ఏదైనా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకి ఈ విలక్షణమైన పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని అనుసంధానం చేయవచ్చు మరియు డబ్బు పంపించడం మరియు ఆమోదించడం చేయవచ్చు. అన్ని బ్యాంకులు మరియు భీమ్ యూపీఐ యాప్స్‌లలో పేటీఎం భీమ్ యూపీఐ ఐడీలు ఆమోదించబడతాయి.
 
యూపీఐ ఐడీని తయారు చేయడానికి, పేటీఎం యాప్ హోం స్క్రీన్ పైన యూజర్లు భీమ్ యూపీఐ విభాగానికి వెళ్లవచ్చు. ఈ ఐడీలు యూజర్ల రిజస్టర్డ్ మొబైల్ నంబర్లుగా ఉంటాయి. ఉదాహరణకు, పేటీఎం యూజర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ 9123456789 అయితే, అతని యూపీఐ ఐడీ 9123456789@paytm గా ఉత్పన్నమవుతుంది. యూజర్లు తమ పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని తమ ప్రస్తుతమున్న సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయవచ్చు. ఈ ప్రత్యేకత సమీక్ష పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ పైన ప్రస్తుతం లభిస్తోంది మరియు త్వరలోనే ఇది ఐఓఎస్ పైన కూడా లభిస్తుంది.
 
పేటీఎం భీమ్ యూపీఐతో, యూజర్లు ఇప్పుడు నిరంతరంగా మరియు బెనిఫిషియరికి చేర్చటానికి వేచి ఉండాల్సిన సమయం లేకుండానే  వెంటనే డబ్బుల్ని నేరుగా రెండు బ్యాంకు ఖాతాల మధ్య బదిలీ చేయవచ్చు. డబ్బు అందుకోవటానికి వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఐఎఫ్ ఎస్‌సీకోడ్‌ని వేరొకరితో పంచుకోవల్సిన అవసరం లేదు. మరిన్ని అవకాశాలు, సౌకర్యం మరియు గొప్ప సులభంగా డిజిటల్‌గా లావాదేవీ చేయడానికి పెద్ద సంఖ్యలో పేటీఎం యూజర్లకి ఇది అవకాశం ఇస్తుంది.
 
తమ పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని తయారు చేయడానికి మరియు దాన్ని ఉపయోగిస్తూ డబ్బుని ఆమోదించడానికి పేటీఎం తన 5 మిలియన్ వ్యాపార భాగస్వాములకి శిక్షణనిస్తుంది. సింగిల్ పేటీఎం భీమ్ యూపీఐ ఐడీతో బహుళ బ్యాంకు ఖాతాల్ని చేరుస్తూ మరియు తమ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బుని ఆమోదించే సౌలభ్యతని కూడా వ్యాపారులు పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) మార్గదర్శకాల ప్రకారం, యూజర్లు భీమ్ యూపీఐని ఉపయోగిస్తూ రోజుకి రూ.1 లక్ష వరకు పంపించవచ్చు; డబ్బు అందుకోవటానికి ఎటువంటి పరిమితి లేదు.
 
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ రేణు సత్తి మాట్లాడుతూ, ' ఒక నిజమైన బహిరంగ పేటీఎం వేదిక యొక్క మా ప్రయాణంలో భాగంగా, చెల్లింపు ఆధారం మరియు గమ్యస్థానాన్ని ఎంచుకోవడానికి వినియోగదారులు మరియు వ్యాపారులు ఇద్దరూ ఎంపికల సంపూర్ణ శ్రేణిని కలిగి ఉండాలి. మా విస్తృతమైన  యూజర్ల సంఖ్యకి మరియు వ్యాపారుల నెట్ వర్క్ కి భీమ్ యూపీఐ లభ్యతతో, డిజిటల్ చెల్లింపుల తదుపరి స్థాయిని త్వరలోనే ప్రారంభిస్తామని మేము విశ్వశిస్తున్నాం'. 
 
పేటీఎం వాలెట్, భీమ్ యూపీఐ లేదా ఇతర చెల్లింపుల పద్ధతుల్ని ఉపయోగించడం ద్వారా చెల్లింపులు చేయడం అనేది  తమ యూజర్లు మరియు వ్యాపారులకు డిజిటల్ చెల్లింపుల స్వేచ్ఛని కలిగించడానికి మరియు వారికి మరిన్ని ఎంపికల్ని అందించడానికి  కంపెనీ చేసే  ప్రయత్నాల్లో ఒక భాగం. పేటీఎం వేదికపై సౌకర్యవంతంగా లావాదేవీలు జరపడానికి మరియు పేటీఎం వ్యాపారులు విస్తృతమైన కస్టమర్ల నుండి చెల్లింపులు ఆమోదించటం సాధ్యమవుతుంది కాబట్టి వారి వ్యాపార అవకాశాల్ని పెంచడానికి అవకాశం ఇస్తుంది. (సాఫ్ట్ బ్యాంక్ మద్దతు గల పేటీఎంకి 280 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. 120 మిలియన్ యాప్ ఇన్ స్టాల్ చేయబడ్డాయి మరియు 5 మిలియన్లకి పైగా ఆఫ్ లైన్ వ్యాపారులు ఉన్నారు.)