గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 నవంబరు 2017 (16:46 IST)

పేటీఎం ఇన్‌బాక్స్ ప్రారంభించింది : ఇన్-చాట్ చెల్లింపులతో మెసేజింగ్ వేదిక

భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల వేదిక పేటీఎం మెసేజింగ్ సర్వీస్ ఇన్బాక్స్‌ని ప్రారంభించింది. స్నేహితులు మరియు కుటుంబంతో చాట్ చేయడానికి మరియు ఒకే సమయంలో డబ్బు కోసం అభ్యర్థన చేయడానికి మరియు డబ్బు పంపించడానికి వినియోగదారులకు ఇది అవకాశం ఇస్తుంది. ఈ

భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల వేదిక పేటీఎం మెసేజింగ్ సర్వీస్ ఇన్బాక్స్‌ని ప్రారంభించింది. స్నేహితులు మరియు కుటుంబంతో చాట్ చేయడానికి మరియు ఒకే సమయంలో డబ్బు కోసం అభ్యర్థన చేయడానికి మరియు డబ్బు పంపించడానికి వినియోగదారులకు ఇది అవకాశం ఇస్తుంది. ఈ మెసేజింగ్ వేదిక ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది మరియు యూజర్లు వ్యక్తిగత సంభాషణల్ని ప్రారంభించవచ్చు మరియు గ్రూపు చాట్స్ తయారుచేయవచ్చు. వారు వెంటనే ఫోటోలు, వీడియోలు పంపించవచ్చు, లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవచ్చు, బిల్ట్-ఇన్-కెమేరాతో అద్భుతమైన క్షణాల్ని చిత్రీకరించి పంచుకోవచ్చు. డిలీట్ ఫర్ ఆల్ ఉపయోగిస్తూ తమ మెసేజ్‌ల్ని రీకాల్ చేసే ప్రత్యేకత కూడా యూజర్లకు లభిస్తోంది. పేటీఎం ఇన్‌బాక్స్ ఆండ్రాయిడ్‌లో లైవ్‌లో ఉంది మరియు ఐఓఎస్ యూజర్లకు త్వరలోనే లభించనుంది.
 
మెసేజింగ్ సర్వీస్‌తో పాటు, పేటీఎం ఇన్‌బాక్స్‌లో నోటిఫికేషన్స్ ఆర్డర్స్, మరియు గేమ్స్ కూడా ఉన్నాయి. నోటిఫికేషన్స్ క్రింద యూజర్లు అన్ని తరగతుల్లో లభించే క్యాష్ బ్యాక్ ఆఫర్లని చూడగలరు; ఆర్డర్ల క్రింద వారు తమ ఆర్డర్లు మరియు తమ లావాదేవీ నవీకరణల్ని చూడగలరు; మరియు గేమ్స్‌లో క్రికెట్ మరియు ట్రివియా-ఆధారిత గేమ్స్ ఉంటాయి.
 
సులభమైన చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా లక్షలాదిమంది యూజర్లు డబ్బుని అందుకోవడానికి మరియు పంపించడానికి పేటీఎం ఇన్‌బాక్స్ దేశంలో మొబైల్ చెల్లింపు పర్యావరణ వ్యవస్థని మరింత విప్లవీకరణ చేసింది. స్థానిక రీటైల్ స్టోర్స్ మరియు ఇంటి నుండి పనిచేసే ఔత్సాహికులు తమ కస్టమర్లతో ఇప్పుడు పరస్పరం మాట్లాడటానికి మరియు పేటీఎం పర్యావరణ వ్యవస్థ  ద్వారా చెల్లింపులు చేయడానికి లక్షలాదిమంది వ్యాపారులకు ఇది ప్రోత్సాహాన్నిచ్చింది. 
 
పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబ్బోట్ ఇలా అన్నారు, ' చెల్లింపులు చేయడంతో పాటు, మా యూజర్లు మరియు వ్యాపారులు ఒకరితో మరొకరు సమాచారం పంచుకోవటానికి కూడా ఇష్టపడుతున్నారని మేము గ్రహించాం. సామాజిక మెసేజింగ్, వాణిజ్యం మరియు చెల్లింపులు నిరంతరంగా ఒకరితో మరొకరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వినియోగదారు అవసరాన్ని తీర్చడంలో మేము పేటీఎం ఇన్‌బాక్స్ చర్య తీసుకున్నాం. మీరు దీని ద్వారా స్నేహితులు/వ్యాపారులతో చాట్ చేయవచ్చు మరియు డబ్బుని సురక్షితంగా మరియు శ్రమ లేకుండా పంపించవచ్చు మరియు అందుకోవచ్చు. ఇది మా వేదికపై మరింతగా నిమగ్నం కావడానికి మాకు సహాయపడుతుంది మరియు మా కస్టమర్లతో శక్తివంతమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
 
ఆన్‌లైన్ రీఛార్జీలు, యుటిలిటి చెల్లింపులు, ప్రయాణం మరియు మూవీ/కార్యక్రమాల బుక్కింగ్స్  మరియు బంగారం కొనుగోలు చేయడంతో సహా విస్తృతమైన శ్రేణి సేవల కోసం రోజూ లక్షలాది మంది యూజర్లు పేటీఎంని ఉపయోగిస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే, మొదటిసారిగా మొబైల్ చెల్లింపులు ఆమోదించడానికి లక్షలాదిమంది అసంఘటిత రీటైలర్ల కోసం డిజిటల్ చెల్లింపులకి పేటీఎం అవకాశం ఇచ్చింది. దీన్ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లోని ప్రధాన రీటైల్ వేదికల్లో విస్తృతంగా ఆమోదిస్తున్నారు. ఈనాడు పేటీఎం, భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకి మారుపేరుగా నిలిచింది. తన మెసేజింగ్ ఫీచర్లతో  పేటీఎం ఇన్‌బాక్స్ ప్రారంభోత్సవం చెల్లింపులు మరియు వాణిజ్యంలో ఇప్పటికే ఉన్న యూజ్-కేసుల విస్తృత శ్రేణికి అదనంగా చేరింది.