శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (15:44 IST)

జియో యూజర్లకు పేటీఎం బంపర్ ఆఫర్... రూ.303 రీచార్జ్.. రూ.150 క్యాష్‌బ్యాక్.. ఎలా?

రిలయన్స్ జియో యూజర్లకు పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.303కి రీచార్జ్ చేసుకున్నట్టయితే రూ.30 తక్షణ (రెండుసార్ల వరకు) తగ్గింపుతో పాటు.. రూ.150 మూవీ మూవీ టిక్కెట్స్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప

రిలయన్స్ జియో యూజర్లకు పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.303కి రీచార్జ్ చేసుకున్నట్టయితే రూ.30 తక్షణ (రెండుసార్ల వరకు) తగ్గింపుతో పాటు.. రూ.150 మూవీ మూవీ టిక్కెట్స్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా రూ.499 అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేసే వారికి కూడా ఆ ఆఫర్‌ వర్తించనుంది. దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత అనేక టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ.. తమ మొబైల్ యూజవర్లను అమితంగా ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో జియో ఫ్రీ ఆఫర్ ఈనెల 31తో ముగియనుంది. దీంతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైమ్ యూజర్లకు కొన్ని ప్రత్యేక ప్యాక్స్‌ను కూడా జియో ప్రకటించింది. అయితే ఇటీవలే జియో నెట్‌వర్క్‌ను ఆపరేటర్ల జాబితాలో చేర్చుతూ పేటీఎం నిర్ణయం తీసుకుంది. జియో యూజర్లు పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చని ప్రకటించింది. 
 
జియో ప్రైమ్ యూజర్లకు ప్రకటించిన 303 రూపాయల ప్యాక్‌ను పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకుంటే 381 రూపాయల వరకూ అదనపు లాభాన్ని పొందొచ్చని పేటీఎం తెలిపింది. ఈ ప్యాక్‌ను రెండు సార్లు రీచార్జ్ చేసుకుంటే 30 రూపాయల తక్షణ తగ్గింపును పేటీఎం ప్రకటించింది. అలాగే, 499 రూపాయల అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేయించుకుంటే.. ప్రతీ రీచార్జ్‌పై 150 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు పేటీఎం పేర్కొంది. అలాగే, 201 రూపాయల జియో యాడ్ ఆన్ ప్యాక్‌ను ఫ్రీగా పొందొచ్చని సంస్థ ప్రకటించింది.