శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:05 IST)

ఇకపై ఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే భారీ ఫైన్... అరుణ్ జైట్లీ ఉక్కుపాదం

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారిపై ఉక్కుపాదం మోపనున్నారు. నిర్ధేశిత గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయనివారి నుంచి ఇకపై భారీ అపరాధాన్ని ముక్కుపిండి వసూలు చేయనున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారిపై ఉక్కుపాదం మోపనున్నారు. నిర్ధేశిత గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయనివారి నుంచి ఇకపై భారీ అపరాధాన్ని ముక్కుపిండి వసూలు చేయనున్నారు. ఐటీఆర్స్ రిటర్న్స్ను ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నామని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు. 
 
అయితే, ఈ జరిమానా అమలు 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి అమల్లోకిరానుంది. ఐటీ చట్టంలోని కొత్త సెక్షన్ 234ఎఫ్‌ కింద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి గడువు లోపు రిటర్న్స్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తే దానికి తగ్గ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు.
 
రెండు స్థాయిల్లో ఈ జరిమానా విధించనున్నారు. నిర్దేశిత గడువు అనంతరం అంటే ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31కు ముందు లేదా అదేరోజు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5 వేల చార్జీలను కట్టాల్సి ఉంటుంది. మరేదైనా సందర్భాల్లో అయితే రూ.10 వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈ మెమోరాండంలో పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం ఆదాయం రూ.5 లక్షల దాటని వారికి కేవలం 1000 రూపాయలే జరిమానా విధించనున్నారు. ఐటీ చట్టంలోని ఈ సవరణలన్నీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఈ మెమోరాండం పేర్కొంది.