మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:19 IST)

శనివారం మళ్లీ పెరిగిన చమురు ధరలు..

దేశంలో గత కొన్ని రోజులుగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నెలలో 16సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. శనివారం రోజున 25 పైసల మేర చమురు ధరలు పెరగడం విశేషం. ఢిల్లీలో పెట్రోల్ పైన 24 పైసలు పెరగ్గా, డీజీల్ పై 15 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 కి చేరగా, డీజీల్ రూ.81.47కి చేరింది. 
 
ముంబైలో రూ.97.57 కి చేరగా, డీజిల్ రూ.88.70 కి చేరింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ 25 పైసలు పెరగ్గా, డీజీల్ పై 17 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 కాగా, డీజీల్ రూ.88.86 కి చేరింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. గత 58 రోజుల్లో 26 సార్లు చమురు ధరలు పెరిగాయి.