బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (10:46 IST)

కొత్తగా మరో 40 ప్రత్యేక రైళ్లు... 21 నుంచి పరుగులు

లాక్డౌన్ అన్‌లాక్-4లో భాగంగా, మరో 40 (20 జతల) సమాంతర రైళ్లను (క్లోన్ ట్రైన్స్) నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నాయి. ఇవి ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే నడుపుతారు. ముఖ్యంగా, వీటిలో ఎక్కువ రైళ్లు బీహార్ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి. రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్ - ధన్‌బాద్‌ల మధ్య నడువనున్నాయి. 
 
అన్‌లాక్-4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. వీటికి 20 జతల రైళ్లు అదనం. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభంకానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో- ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు. కాగా, ఈ రైళ్లను ప్రధానంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నడుపుతోంది.