శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By chakri
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (16:04 IST)

ముఖేష్ అంబానీ బోనస్ ఆఫర్ .. రిలయన్స్ వాటాదారులు హ్యాపీ

తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ వినియోగదారులకు కాదు, రిలయన్స్ వాటాదారులకు. రిలయన్స్ కంపెనీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ వాటాదారులకు బోనస్ ఆ

తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ వినియోగదారులకు కాదు, రిలయన్స్ వాటాదారులకు. రిలయన్స్ కంపెనీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ వాటాదారులకు బోనస్ ఆఫర్‌ను ప్రకటించారు. 
 
ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటాదారులకు 1:1 బోనస్‌ను ప్రకటించారు. అంటే ప్రతి షేరుకు అదనంగా ఒక షేరును బోనస్‌గా అందిస్తారు. దీని ప్రకారం వాటాదారులకు ఎన్ని షేర్‌లు ఉంటే అన్ని షేర్‌లు అదనంగా పొందుతారన్నమాట. శుక్రవారం జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ ఆఫర్‌ను ప్రకటించి, వాటాదారులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.