ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (09:42 IST)

ఆశించిన ఫలితాన్నివ్వని పెద్ద నోట్ల రద్దు.. మార్చి 31లోగా రూ.2 వేల నోటు రద్దు?

దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో రూ.1000 స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000

దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో రూ.1000 స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోటును రద్దు చేసి, రూ.1000 నోటును ప్రవేశపెట్టనున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మార్చి 31వ తేదీలోపు ఈ రూ.2000 నోటును రద్దు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అఖిల భారత స్టేట్‌ బ్యాంక్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు థామస్‌ ఫ్రాంకో తమిళనాడులోని తిరుచ్చి జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. లెక్కల్లో చూపని డబ్బును వెలికితీసేందుకు అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనీ, దీంతో ఈ ఏడాది మార్చి 31లోపు కొత్త రూ.2,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. 
 
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం తీవ్రంగా నష్టపోయిందని, మధ్య తరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుపై నల్లకుబేరులకు, కార్పొరేట్‌ సంస్థలకు ముందుగానే ఉప్పందిందని, దాంతో నల్లధనం పెద్దగా బయటకురాలేదని అన్నారు. కేంద్రం తీసుకున్న చర్య మాత్రం భారతీయ రిజర్వు బ్యాంకును నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.