గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 జులై 2022 (19:04 IST)

ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ భాగస్వామ్యంతో ‘ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్‌” లాంచ్‌ చేసిన ఎస్‌బీఐ కార్డ్

SBI
భారతదేశంలో కేవలం క్రెడిట్ కార్డులు మాత్రమే జారీచేసే అతిపెద్ద సంస్థ ఎస్‌బీఐ కార్డ్, ఆదిత్యా బిర్లా కెపిటల్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్(ABFL)తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో అత్యంత లాభదాయకమైన జీవనశైలి క్రెడిట్ కార్డ్ 'ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డు'ని ఈ రోజు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్యాషన్‌, ట్రావెల్‌, డైనింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, హోటల్స్‌ వంటి జీవనశైలి ఖర్చులపై కస్టమర్లకు చక్కని బహుమతులందించేలా రూపొందించిన కార్డు ఇది. ఈ కారణంగా అన్ని విభాగాల్లో ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డు ఆకర్షణీయంగా నిలుస్తూ ఆదిత్యా బిర్లా బ్యానర్‌ కింద ఈ కార్డు ప్రీమియం, మాస్‌ బ్రాండ్స్‌పై యాక్సెస్‌ అందిస్తుంది.
 
రివార్డులపై అందించే ఈ క్రెడిట్‌ కార్డు- ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్ సెలక్ట్, ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డు రెండు రకాల్లో వీసా వేదికగా అందుబాటులో ఉంది. వోడాఫోన్‌ ఐడియా (Vi), లూయిస్‌ ఫిలిప్‌, వాన్‌ హుసెన్‌, అలెన్ సోలీ, పీటర్‌ ఇంగ్లాండ్‌, పోలో, పాంటలూన్స్‌ వంటి ఆదిత్య బిర్లా గ్రూప్‌ స్టోర్స్‌లో కొనుగోళ్లపై కార్డుదారులు పాయింట్ల రూపంలో చక్కని విలువ పొందవచ్చు. అంతే కాదు హోటల్స్‌పై చేసే ఖర్చులపై అదనపు రివార్డు పాయింట్లు అందించడం ఈ కార్డుకున్న మరో అదనపు ప్రయోజనం. తరచూ ప్రయాణాలు చేసేవాళ్లు ఇది ఎంతో ప్రయోజనమందిస్తుంది.
 
ఎస్‌బీఐ కార్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్ సీఈఓ శ్రీ రామ మోహన్ రావు అమర మాట్లాడుతూ, “భారతదేశంలోని ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీల్లో ఒకటైన ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో చేతులు కలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కస్టమర్లకు  క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు  మాకు సాయపడుతూ వారి అన్ని అవసరమైన ఖర్చులకు గొప్ప ఉత్పత్తిగా నిలుస్తుంది. కస్టమర్లు, సహ-బ్రాండ్ భాగస్వాములకు విలువను పెంచే మా వ్యూహంలో ఇది భాగం. కస్టమర్లను పొందే ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది కాబట్టి కస్టమర్ అనుభూతి మెరుగ్గా ఉంటుంది. భిన్నమైన జీవనశైలి శ్రేణుల్లో ఖర్చు చేసే కస్టమర్లకు ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్ అసమానమైన ప్రయోజనాలతో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన విస్తృతమైన, వైవిధ్యభరితమైన బ్రాండ్ పోర్ట్‌ఫోలియోనూ అందుబాటులో ఉంచుతుంది” అన్నారు.
 
కార్డ్‌ ఆవిష్కరణ సందర్బంగా ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ శ్రీ రాకేష్ సింగ్ మాట్లాడుతూ, “కస్టమర్ల అనుభూతిని మరింత మెరుగుపరిచి, వినూత్న ప్రతిపాదనలు ముందుకు తీసుకురావడంలో ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ ఎప్పుడూ అగ్రగామిగా ఉంటుంది. ఎస్‌బీఐ కార్డుతో కలిసి ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డు ప్రవేశపెడుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్‌ ప్రస్తుత కస్టమర్లతో పాటు కాబోయే కస్టమర్లకు కూడా సౌకర్యవంతమైన, లాభదాయకమైన, సంతోషకరమైన జీవనశైలి అనుభూతిని అందిస్తుంది. వినియోగదారులు నేడు డిజిటల్‌ చెల్లింపులను అందిపుచ్చుకుంటున్నారు, ఈ కార్డు ద్వారా మా వినియోగదారుల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. అవాంతరాలు లేని చెల్లింపులతో పాటు చక్కని రివార్డులు అందించే ఈ కార్డుల ద్వారా  మా వినియోగదారులకు మేము మరింత చేరువ కాగలుగుతాం” అన్నారు.
 
వీసా ఇండియా, సౌత్ ఏషియా, గ్రూప్ కంట్రీ మేనేజర్, సందీప్ ఘోష్ మాట్లాడుతూ, “కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం వీసా, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎస్‌బీఐ కార్డ్‌ మధ్య ఈ అద్భుతమైన భాగస్వామ్యం సరళమైన, అనుకూలమైన ఆఫర్స్ అందించేందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఎంపిక చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండ్‌లు, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇంధనం వంటి కేటగిరీలను అందిస్తుంది. ఈ ప్రయత్నం వినియోగదారులను ఆకర్షిస్తుందని, విశ్వాసాన్ని పెంపొందించడంలో సాయపడుతుందని మేము భావిస్తున్నాము” అని అన్నారు.
 
‘ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్’ ద్వారా కస్టమర్లు ఆదిత్య బిర్లా స్టోర్‌లలో చేసే ప్రతి రూ. 100 ఖర్చుపై 20 రివార్డ్ పాయింట్లు, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, హోటళ్లలో చేసే ప్రతి రూ. 100 ఖర్చుపై 10 రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. స్వాగత కానుకగా కార్డ్ మెంబర్‌షిప్ ఫీజు చెల్లింపుపై కస్టమర్లకు 6000 రివార్డ్ పాయింట్లు అందిస్తుంది. అలాగే  రూ. 1.5 లక్షల వార్షిక ఖర్చు మైలురాయిని చేరినట్టు అయితే 3000 రివార్డ్ పాయింట్లు, రూ. 3 లక్షల వార్షిక ఖర్చుల మైలురాయి చేరుకున్నప్పుడు అదనంగా 3000 రివార్డ్ పాయింట్లు కూడా పొందవచ్చు. ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డు, ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్ సెలక్ట్ కార్డు జాయినింగ్‌/వార్షిక ఫీజులు వరుసగా రూ.499, రూ.1499గా ఉన్నాయి.