శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 జులై 2022 (15:15 IST)

అమేజాన్ ఫ్రెష్ ఇప్పుడు ఒంగోలులో...

Amazon
అమేజాన్ ఇండియా అమేజాన్ ఫ్రెష్, తన ఫుల్ బాస్కెట్ గ్రాసరీ సేవలను ఒంగోలులో విస్తరిస్తున్నామని ఈరోజు ప్రకటించింది. ద అమేజాన్ ఫ్రెష్ యాప్-ఇన్-యాప్ అనుభవం పండ్లు, కూరగాయలు, చిల్డ్ ఉత్పత్తులు, బ్యూటీ, బేబీ, పర్శనల్ కేర్, పెట్ ఉత్పత్తులు, నిత్యావసర కిరాణా సరుకులలో 3000+ కి పైగా కిరాణా ఉత్పత్తులు యొక్క విస్త్రతమైన ఎంపికను అందిస్తోంది. ఒంగోలులో కస్టమర్స్ సూపర్ వేల్యూ సేవింగ్స్, ఉదయం 9 గంటలు నుండి రాత్రి 9 గంటలు వరకు 3 గంటల డెలివరీ స్లాట్స్‌ను ఆనందించగలరు.
 
శ్రీకాంత్ శ్రీరామ్, హెడ్, అమేజాన్ ఫ్రెష్ ఇలా అన్నారు, "అమేజాన్ ఫ్రెష్ అనేది కస్టమర్స్‌కు విస్తృతమైన ఎంపిక, సాటిలేని విలువ మరియు సౌకర్యం అన్నీ ఒకే చోట అందించే గమ్యస్థానం. మేము మా కస్టమర్స్‌కు సేవలు అందించడానికి కట్టుబడ్డాము. ప్రతిది మరియు ప్రతిరోజూ స్టోర్‌గా ఉండే మా నిబద్ధత ద్వారా ప్రోత్సహించబడ్డాము. ఈ ఆరంభంతో, ఒంగోలులో ఉన్న కస్టమర్స్ ఉన్నతమైన నాణ్యత గల తాజా పండ్లు, కూరగాయలు తమ ఇంట ముంగిట సురక్షితంగా కొనుగోలు చేయగలరు. అదనంగా, మార్కెట్ ప్రదేశాన్ని సానుకూలం చేయడానికి ఈ ప్రాంతంలో స్థానిక రైతులకు సౌకర్యం కల్పించే మా ప్రయత్నంలో భాగంగా మరియు డిజిటల్ ఎకానమీలో భాగంగా మారడానికి, మేము వారి నుండి తాజా ఉత్పత్తిని సంపాదిస్తాము. ఉన్నతమైన నాణ్యత గల పండ్లు, కూరగాయలను కస్టమర్లు సులభంగా పొందే విధంగా పంట దిగుబడిని మెరుగుపరచడానికి అగ్రోనమీ సేవలను వారికి అందిస్తాము."
 
 కస్టమర్స్ నెల రోజులు కోసం భద్రపరచుకోవాలని కోరుకున్నప్పుడు వారికి సహాయపడటానికి సూపర్ సేవర్ డీల్స్ నుండి కూడా కస్టమర్స్ ప్రయోజనం పొందగలరు. గొప్ప ఆదాలతో పాటు, ఉత్పత్తుల విస్తృతమైన ఎంపిక మరియు వేగవంతమైన, సౌకర్యవంతమైన డెలివరీ ఆప్షన్స్‌ను ఆన్లైన్లో ఒకే చోట లభింపచేస్తూ అమేజాన్ ఫ్రెష్ కిరాణా సరుకులు కోసం ప్రత్యేకమైన యాప్-ఇన్-యాప్‌తో అప్ గ్రేడ్ చేయబడిన షాపింగ్ అనుభవాన్ని కలిగి ఉంది. తరచుగా షాపింగ్ చేసిన వస్తువులను చెక్ అవుట్ సమయంలో మర్చిపోకుండా ఉండటాన్ని నిర్థారించడానికి సౌకర్యవంతమైన వ్యక్తిగత విడ్జెట్స్, రిమైండర్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.