భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమ కంపెనీలలో టాప్ 5గా నిలిచిన సింక్రోనీ
ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, సింక్రోనీ తాము భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా గ్రేట్ ప్లేస్ టు వర్క్- ఇండియా నుంచి గుర్తింపు పొందినట్లు వెల్లడించింది. ఈ అత్యద్భుమైన గుర్తింపు, తమ ఉద్యోగులకు సమ్మిళిత, మద్దతుతో కూడిన, స్ఫూర్తిదాయక వాతావరణం అభివృద్ధి చేయడంలో సింక్రోనీ యొక్క రాజీలేని నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది.
తాము టాప్ 5 గుర్తింపు పొందడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన సింక్రోనీ ఇండియా బిజినెస్ లీడర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆండీ పొన్నేరీ మాట్లాడుతూ, "మా ఉద్యోగులు, సింక్రోనీని గ్రేట్ ప్లేస్ టు వర్క్‌గా నిలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపును గ్రేట్ ప్లేస్ టు వర్క్ నుంచి అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈమైలురాయి, మా ఉద్యోగుల పట్ల మా స్థిరమైన నిబద్ధతను వెల్లడిస్తుంది. వీరే మా సంస్థ విజయానికి వెన్నుముకగా నిలిచారు. సింక్రోనీ వద్ద, మేము వైవిధ్యత, సమ్మిళితత మరియు ఆవిష్కరణను అత్యున్నతంగా నిలుపుతున్నాము.
అత్యంత ఆకర్షణీయమైన రీతిలో 50% మహిళా ప్రాతినిథ్యం కలిగి ఉండటంతో పాటుగా 100 మంది వ్యక్తులు దివ్యాంగులు. దీనితో పాటుగా 45 ఏళ్లకు పైబడిన వెటరన్స్‌కు మా అచంచలమైన మద్దతు తో పాటుగా వెటరన్ కుటుంబసభ్యులకు సైతం మద్దతు అందించడం ద్వారా ప్రతి వ్యక్తి ఎదిగేందుకు తగిన వాతావరణం కల్పిస్తున్నాము. ఈ గుర్తింపు , మా ఉద్యోగుల పట్ల మా నిబద్ధతను వెల్లడించడంతో పాటుగా అసాధారణ పని సంస్కృతిని సైతం వెల్లడిస్తుంది. మరింత ముందుకు వెళ్తే, సహకార మరియు వృద్ధి ఆధారిత వాతావరణం ప్రోత్సహించటానికి కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్కరికీ అసాధారణ వర్క్‌ప్లేస్‌గా ఆదర్శంగా నిలువాలనే ప్రయత్నాలను సింక్రోనీ కొనసాగించనుంది" అని అన్నారు.
గౌరవ్ సెహగల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హ్యూమన్ రిసోర్శెస్-ఆసియా మాట్లాడుతూ " సింక్రోనీ వద్ద, మేము సాధికారిత కలిగిన వాతావరణం సృష్టించడానికి ప్రాధాన్యత ఇస్తుంటాము. అక్కడ మా ఉద్యోగులు తమ పూర్తి సామర్థ్యం ప్రదర్శించుకునే అవకాశమూ అందిస్తున్నాము. మా 100% వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, భారతదేశంలో మా కార్యకలాపాల నిర్వహణలో వినూత్నభాగంగా నిలుస్తుంది. మా టీమ్స్ అత్యున్నతంగా పనిచేయడంతో పాటుగా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయడం మా వినూత్న ప్రయోజనాలతో సాకారమవుతుంది. అత్యధికంగా 97% మంది ఉద్యోగులు గ్రేట్ ప్లేస్ టు వర్క్‌గా సింక్రోనీని పేర్కొన్నారు. మా వర్క్‌ప్లేస్ అనుభవాలను నిరంతరం వృద్ధి చేస్తూనే ఉన్నాము. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు అందుకోవడం ఓ గౌరవంగా భావిస్తున్నాము. మా ఉద్యోగుల వృద్ధి, సంక్షేమానికి కట్టుబడేందుకు మా స్థిరమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ ప్రశంసలు సమానమైన, వైవిధ్యమైన, సమ్మిళిత వాతావరణం అభివృద్ధి చేయాలనే మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది. మా ఉద్యోగులు విజయం సాధించడంతో పాటుగా అభివృద్ధి సాధించేందుకు, భాగస్వామ్యాలను నిర్మించుకునేందుకు, ఆవిష్కరణలను చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము. సంయుక్తంగా, మేము కలిసి పనిచేయడాన్ని పునర్నిర్వచించడంతో పాటుగా మా ఉద్యోగుల సంక్షేమాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తామనే భరోసా కల్పిస్తున్నాము" అని అన్నారు.