బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 10 డిశెంబరు 2022 (16:30 IST)

రెడ్‌ క్రాస్‌, సత్వా సహకారంతో యువత-వెటరన్స్‌ ప్రాణాలను రక్షించడంలో సహాయపడటానికి బ్లడ్‌ డ్రైవ్‌ను నిర్వహించిన సింక్రోనీ

Blood donation drive
ప్రీమియర్‌ కన్స్యూమర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ, సింక్రోనీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. రెడ్‌ క్రాస్‌, సత్త్వాఎట్‌ ద సాలార్‌పురియా సత్త్వా నాలెడ్జ్‌ సిటీ మద్దతుతో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్‌ వద్ద చికిత్స పొందుతున్న రోగుల చికిత్సకు మద్దతునందించేందుకు ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కమ్యూనిటీ కార్యక్రమంలో 200కు పైగా యూనిట్ల బ్లడ్‌ను సేకరించడం ద్వారా హాస్పిటల్‌తో పాటుగా తలసేమియా ప్రభావిత చిన్నారులకు మద్దతు అందించనున్నారు. గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర  గవర్నర్‌, గౌరవనీయ పుదుశ్చేరి రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ (శ్రీమతి )తమిళసై సౌందర్‌రాజన్‌ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
 
తలసేమియా అనేది వారసత్వంగా వచ్చే రక్తలోపం. ఈ వ్యాధి బారినపడిన వారు అతి తక్కువ హిమోగ్లోబిన్‌ కలిగి ఉండటంతో పాటుగా అతి తక్కువ రక్త కణాలనూ కలిగి ఉంటారు. అధికంగా చిన్నారులలో ఈ సమస్యను గుర్తిస్తారు. ఈ లోపం కలిగిన వారిలో తీవ్ర అలసట, ఎదుగుదల నెమ్మదిగా ఉండటం, నీరసం వంటి సమస్యలు కనిపిస్తాయి. తలసేమియా తీవ్రంగా ఉన్న రోగులకు ప్రతి 21 రోజులకూ ఒకసారి రక్త ఎక్కించడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడవచ్చు  భారతదేశంలో ఒక లక్ష మంది చిన్నారులు తలసేమియాతో బాధపడుతున్నారని అంచనా. కానీ కొంతమంది మాత్రమే ఈ సమస్యను అధిగమించగలుగతున్నారు. ఈ కారణం చేతనే అందుబాటు ధరలో అత్యవసర చికిత్స అందించాల్సి ఉంది. దాదాపు 1000 మంది ఈ తరహా రోగులు రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద నమోదు చేసుకున్నారు మరియు ప్రతి రోజూ 30-40 మంది చిన్నారులకు ఉచితంగా ఇక్కడ రక్తం ఎక్కిస్తున్నారు.
 
ఈ కార్యక్రమం గురించి కామేశ్వరి గంగాధరభట్ల, వైస్‌ ప్రెసిడెంట్‌, హ్యూమన్‌ రిసోర్శెస్‌- ఆసియా డైవర్శిటీ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ సీఓఈ లీడర్‌ మాట్లాడుతూ, ‘‘ వనరుల లభ్యత పైనే మెడికల్‌ కేర్‌ ఆధారపడి ఉంటుంది. మహమ్మారి అత్యున్నత స్ధాయి ఆరోగ్య మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను మరోసారి పునరుద్ఘాటించింది. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడంతో పాటుగా తలసేమియా చేత ప్రభావితమైన చిన్నారులలో సానుకూల మార్పును తీసుకురావడం లక్ష్యంగా చేసుకుని ఈ రక్తదాన శిబిరం చేశాము. ఈ రక్తదాన శిబిరం ద్వారా రోగులకు రక్త సరఫరా పరంగా ఎలాంటి  కొరత లేదని నిర్ధారించాలనుకున్నాము. సింక్రోనీ యొక్క వెటరన్‌ నెట్‌వర్క్‌, ఎప్పుడూ కూడా కమ్యూనిటీ మెరుగుకోసం కట్టుబడి ఉంది. సమాజంలోని ప్రతి సభ్యుని జీవన నాణ్యతను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ముఖ్యమైన కార్యక్రమం కోసం రెడ్‌ క్రాస్‌, సత్త్వాతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమం కోసం సహకారమందించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.
 
గౌరవనీయ తెలంగాణా మరియు పుదుశ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ (శ్రీమతి )తమిళసై సౌందర్‌రాజన్‌ ఈ శిబిరం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రక్తదాన ఆవశ్యకతను గురించి వెల్లడించారు. సింక్రోనీ, సత్త్వా మరియు రెడ్‌క్రాస్‌లు ఏకతాటిపైకి రావడంతో పాటుగా మిలటరీ వెటరన్స్‌, చిన్నారులకు సహాయపడటానికి ముందుకురావడాన్ని అభినందించారు. తన వైద్య అనుభవాల నుంచి రక్తదాన అవసరాలకు సంబంధించిన అంశాలను వెల్లడించిన ఆమె ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయాల్సిందిగా కోరారు.
 
సత్త్వా బిజినెస్‌ హెడ్‌ పియూష్‌ అగర్వాల్‌  మాట్లాడుతూ, అన్ని దానాల్లోనూ రక్తదానం మిన్న అన్నారు. ఈ శిబిరంలో చురుగ్గా పాల్గొనడంతో పాటుగా  రక్తదానమిచ్చిన వలెంటీర్లందరికీ ధన్యవాదములు తెలిపారు. సత్త్వా, రెడ్‌ క్రాస్‌లతో కలిసి సింక్రోనీ నిర్వహించిన ఈ శిబిరంలో  సేకరించిన రక్తంతో  మిలటరీ హాస్పిటల్‌ అవసరాలు తీరనున్నాయి. ఆయన మాట్లాడుతూ సత్త్వా ఎప్పుడూ కూడా మానవతా కార్యక్రమాలకు మద్దతునందించేందుకు ముందుంటుందన్నారు. ప్రాణాలను కాపాడే అత్యుత్తమ కార్యక్రమాలలో తాము పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా శిబిరాన్ని ప్రారంభించిన గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ (శ్రీమతి) తమిళసై సౌందర్‌ రాజన్‌కు ధన్యవాదములు తెలిపారు.
 
సైనిక్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌డబ్ల్యుఓ) నుంచి కల్నల్‌ రమేష్‌ మాట్లాడుతూ ‘‘మానవాళికి పాలను అందిస్తున్న ఆవులా, మనం రక్తదానం చేయాలి. ఆవు పాలిస్తున్నప్పుడు మనం ఆ పాలను తన బిడ్డకు అందిస్తున్నామా లేదా అని అడగదు. అలాగే దాని యజయాని ఆ పాలను విక్రయిస్తున్నాడా లేదా అని కూడా చూడదు. అలాగే పాలను తీసే వ్యక్తి  లేదంటే అంతిమంగా ఆ పాలను వినియోగిస్తున్న వ్యక్తుల కులం, మతం కూడా పట్టించుకోదు’’ అని అన్నారు.  ఈ రక్తదాన శిబిరానికి మద్దతు అందించడం పట్ల తన సంతోషాన్ని ఆయన వ్యక్తపరిచారు.